వేణు స్వామికి మరోసారి నోటీసులు

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి( Venu Swamy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల జ్యోతిష్యం చెప్పడంలో ముందు వరుసలో ఉంటారు.అయితే, తాజాగా వేణు స్వామికి ఒక చిక్కు ఎదురైంది.

మహిళా కమిషన్( Women Commission ) రెండోసారి నోటీసులు జారీ చేశారు.కోర్టు ఆదేశాల మేరకు మహిళా కమిషన్ మరోసారి నోటీసులు( Notices ) పంపినట్లు.

అందులో నవంబర్ నెల 14న కమిషన్ ముందు హాజర అవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.

వాస్తవానికి మొదటి నోటీస్ కు హాజరవ్వకుండా వేణు స్వామి కోర్టుకు ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది.

"""/" / అనంతరం ఇచ్చిన స్టేను ఎత్తివేయడంతో మహిళా కమిషన్ తో మరోసారి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

వాస్తవానికి వేణు స్వామి నాగచైతన్య, శోభిత( Naga Chaitanya, Sobhita ) వైవాహిక జీవితం త్వరలోనే ముగిస్తుందని జోష్యం చెప్పడంతో అక్కినేని ఫ్యామిలీ అభిమానులతో పాటు, మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

గతంలో కూడా మహిళా జర్నలిస్టుల సైతం ఉమెన్ కమిషన్ కు వేణు స్వామి ఫిర్యాదులు కూడా చేశారు.

సెలబ్రిటీల జీవితాల గురించి జోష్యం చెబుతూ వేణు స్వామి ఎప్పుడు కూడా విమర్శలపాలు అవుతూనే ఉంటారు.

"""/" / గతంలో కూడా అక్కినేని వారసుడు నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకొని విడిపోతారని జోష్యం చెప్పారు.

అచ్చం అతను చెప్పినట్ల విధంగానే నాగచైతన్య సమంత వివిధ కారణాలతో విడిపోవడం జరిగింది.

అయితే కొన్ని రోజుల గ్యాప్ అనంతరం నాగచైతన్య శోభిత ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్న అనంతరం కూడా వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకుని విడిపోతారని వేణు స్వామి జాతకం చెప్పాడు.

దీంతో మరొకసారి వేణు స్వామి వివాదంలో చిక్కుకొని మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందుకుంటున్నాడు.

చూడాలి మరి చివరికి ఈ వివాదానికి ఎలాంటి ముగింపు పలుకుతుందో.

వీల్ చైర్ లో నటి రష్మిక మందన్న…షాక్ లో అభిమానులు!