జీతం అడిగితే మహిళను తీవ్రంగా కొట్టిన యజమాని!

కొందరు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటారు.వాళ్లు మనుషులమే అన్న విషయం మర్చిపోయి మరీ దారుణంగా బిహేవ్ చేస్తారు.

అలాంటి వారికి ఆడ, మగ అనే తేడాలు ఉండవు.పెద్దా, చిన్నా అనే సోయి ఉండదు.

కోపంలో ఏం చేస్తుంటారో వారికే తెలియదు.ఆవేశంలో విచక్షణ కోల్పోతారు.

అచ్చంగా అలాంటి ఘటనే జరిగింది కర్ణాటక రాష్ట్రంలో అసలేం జరిగిందంటే.అది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు.

ఒక స్పాలో పని చేస్తుంది ఓ మహిళ.తనకు జీతం రావడం చాలా ఆలస్యం అయింది.

నెల జీతం రావడానికి నెల సమయం పట్టింది.అయినా ఆ యజమానికి తనకు జీతం ఇవ్వలేదు.

చాలా సార్లు అడిగి చూసింది.కానీ ఆ స్పా ఓనర్ నుండి తిరస్కారమే ఎదురైంది.

మరోవైపు కుటుంబపోషణకు డబ్బులు కావాలి.అదే విషయం యజమానికి చెప్పినా అతను కనికరించలేదు.

జీతం కావాలని అడగడం కోసం యజమాని ఇంటికి వెళ్లింది.ఇంటికి వచ్చి జీతం అడగడంతో ఆ యజమానికి తీవ్రంగా కోపం వచ్చింది.

అలా ఇంటికి రావడంపై తీవ్రంగా ఆగ్రహించాడు.స్పా యజమాని మనోజ్.

రోడ్డుపైనే ఆ మహిళను పట్టుకుని బూతులు తిట్టాడు.జీతం కోసం ఇంటికి వస్తావా అని కొప్పడ్డాడు.

నడిరోడ్డుపై తిట్టడమే కాకుండా ఆ మహిళను కాలితో తన్నాడు.తీవ్రంగా కొట్టాడు.

దెబ్బలు తాలలేక ఆ మహిళ రోడ్డుపై పడిపోయింది.అయినా కనికరం లేకుండా కొడుతూనే ఉన్నాడు.

ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.ఈ ఘటన అనంతరం ఆ బాధిత మహిళ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

బాహుబలి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కోట.. ఇప్పుడు పట్టించుకుంటారా అంటూ?