మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా పోలీస్ లను సంప్రదించండి..

రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ( SP Akhil Mahajan ) భరోసా ఇచ్చారు.

జిల్లాలో ఈ సంవత్సరంలో షీ టీమ్స్ బృందాలు ద్వారా కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.

షీ టీమ్( SHE Teams ) కు వచ్చిన ఫిర్యాదులలో 06 ఎఫ్ ఐ ఆర్ లు 02 పెట్టి కేసులు లు నమోదు చేయడం జరిగింది.

మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న పోకిరీలు వల్ల తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు.

మహిళలపై జరుగు నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

పోలీస్ శాఖ( Police Department ) మహిళా భద్రతకు కొరకు జిల్లా వ్యాప్తంగా షి టీమ్స్ ఏర్పాటు చేసి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థినీలు, యువతులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నదని చెప్పారు.

మహిళలు ముఖ్యంగా సామాజిక మధ్యమాలైన ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇన్ స్టాగ్రామ్ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని , ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు .

ఎవరైనా ఆకతయులు మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు షీ టీమ్ నంబర్ 87126 56425 డయల్ 100 కు సమాచారం ఇవ్వగలరు మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడతాయని ఎస్పీ తెలిపారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?