మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా పోలీస్ లను సంప్రదించండి.

మహిళలు పని చేసే ప్రదేశాల వద్దకి వెళ్లి అవగాహన కల్పిస్తున్న జిల్లా షీ టీమ్ బృదం.

జిల్లా వ్యాప్తంగా రద్దీగాల షీ టీమ్ సిబ్బంది మఫ్టీలో నిఘా.మహిళలను వేధిస్తున్న పోకిరీలపై 04 కేసులు , 03 పెట్టి కేసులు నమోదు.

మహిళలు,బాలికలు,విద్యార్థినిలు వేధింపులకు గురైనట్లు అయితే వెంటనే జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 లేదా డయల్ 100 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.

జిల్లాలో షీ టీమ్స్ బృందాల ద్వారా కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.

ఏప్రిల్ నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 04 ఎఫ్ ఐ ఆర్ లు, 03 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు.

మహిళలపై జరుగు నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

పోలీస్ శాఖ మహిళా భద్రతకు కొరకు జిల్లా వ్యాప్తంగా షి టీమ్స్ ఏర్పాటు చేసి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థినీలు, యువతులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నదని చెప్పారు.

మహిళలు ముఖ్యంగా సామాజిక మధ్యమాలైన ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇన్ స్టాగ్రామ్ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని , ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు .

ఎవరైనా ఆకతయులు మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు షీ టీమ్ నంబర్ 87126 56425 డయల్ 100 కు సమాచారం ఇవ్వగలరు మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడతాయని ఎస్పీ తెలిపారు.

ఇక చుండ్రుతో నో టెన్షన్.. ఒక్క వాష్ లోనే వదిలించుకోండిలా!