దైర్యంగా మహిళలు,యువతులు ముందుకు వస్తేనే వేధింపుల నుండి బయటపడగలరు.

సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తుల పట్ల,సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

గంజాయి లాంటి మతుపదార్థాల కు దూరంగా ఉండాలి.గంభీరావుపేటలోని కేజీ టు పీజీ ఆవరణలో విద్యార్థినిలతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల జిల్లా:దైర్యంగా మహిళలు,యువతులు ముందుకు వస్తేనే వేధింపుల నుండి బయటపడగలరని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.

గురువారం రోజున గంభీరావుపేటలోని కేజీ టు పీజీ ఆవరణలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఉమెన్ సేఫ్టీ,మహిళల రక్షణ చట్టాల గురించి ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై ,సోషల్ మీడియా, సైబర్ నేరాలు, గంజాయిలపై ఏర్పటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.మహిళలు, విద్యార్థినులు వేధింపుల నుండి బయట పడేందుకు దైర్యంగా ముందుకు వెళ్ళడమే మార్గామని,విద్యార్థినిలు పోకిరీల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వేదింపులకు సంబందించి ఏదైనా చిన్న సంఘటన జరిగిన వెంటనే ఇంట్లో తల్లిదండ్రులకు గానీ, టీచర్స్ కు గానీ తెలియజేయాలని, ఎవరైనా తమ పట్ల చిన్న తప్పు చేసేందుకు ప్రయత్నిస్తున్న ముందుగానే గుర్తించి అలాంటి వారిని దూరంగా ఉంచాలన్నారు.

జిల్లాలో మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్ విద్యా సంస్థలు, బస్టాండ్ లు, మహిళలు పని చేసే ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో డ్రెస్ లలో నిరంతరం పోకిరీలపై నిఘా ఉంచుతూ మహిళా చట్టాలపై వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

ఎవరైనా వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.

విద్యార్థులు సోషల్ మీడియా కి దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులు పంపే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రస్తుతం యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల డబ్బును దోచుకోవడానికి వివిధ రకాల మార్గాలను ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలియజేసారు.

సైబర్ నేరాల బారినపడి ఎవరైనా తమ అకౌంట్ నుండి డబ్బులు పోగొట్టుకున్నట్లయితే వెంటనే స్పందించి 1930 నంబరుకు ఫోన్ చేసి వివరాలను అందించగలిగితే సైబర్ నేరగాల ఖాతా నుండి ఆ డబ్బును రికవరీ చేయవచ్చని తెలిపారు.

ఎస్పీ వెంట డిఎస్పీ ఉదయ్ రెడ్డి, సి.ఐ శశిధర్ రెడ్డి, ఎస్.

ఐ రామ్మోహన్ , షీ టీం ఏ.ఎస్.

ఐ ప్రమీల సిబ్బంది ప్రియాంక, రమదేవి,శ్రీధర్, పాఠశాల సిబ్బంది ఉన్నారు.

తమిళ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న అక్కినేని అఖిల్…