స్త్రీలు సాష్టాంగనమస్కారం చేయవచ్చా? TeluguStop.com
సాష్టాంగం అంటే ‘స అష్టాంగం’ అంటే ఎనిమిది అవయవాలతో చేసే నమస్కారం.దేవాలయాలకు వెళ్ళినప్పుడు, లేదా ఇంట్లో వ్రతం గానీ పూజగాని జరిగినప్పుడు గురువులకు నమస్కరించేప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తారు.
స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు.సాష్టాంగ నమస్కారం చేసేప్పుడు వక్షస్థలం, నుదురు, చేతులు,కాళ్ళు,కన్నులూ నేలకు ఆన్చి నమస్కరించాలి.
కానీ స్త్రీ ఉదరం గర్భాశయాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సాష్టాంగం వల్ల అది ఒత్తిడికి గురవుతుంది.
దాని వల్ల గర్భ స్రావాలు, లేదా మరే ఇతర ఇబ్బందులైనా జరిగే ప్రమాదం ఉంది.
అటువంటిది జరగకుండా స్త్రీలను సాష్టాంగ నమస్కారం చేయవద్దంటారు.స్త్రీలు మోకాళ్ళపై ఉండి నమస్కరించాలి.
లేదా నడుమును వంచి నమస్కరించవచ్చు.స్త్రీలు ‘పంచాంగ నమస్కారాన్ని’ .
అంటే కాళ్ళు , చేతులు నుదురు మాత్రమే తాకేలా నమస్కరించడం చేయాలి.