Dry Fruit Jewellery : వీడియో: వాటే క్రియేటివిటీ.. డ్రై ఫ్రూట్స్‌తో జ్యువెలరీ తయారీ…
TeluguStop.com
కొంతమంది పెళ్లిళ్ల వంటి పెద్ద ఈవెంట్లకు ప్రత్యేకమైన ఆభరణాలు, మేకప్ ధరించడానికి ఇష్టపడతారు.
అందరిలో తామే ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు.కొంతమంది వెరైటీ ట్రెండ్స్ ఫాలో అవుతూ స్పెషల్‌గా నిలవాలని ప్రయత్నాలు చేస్తుంటారు.
తాజాగా ఒక మహిళ కూడా కొత్త ట్రెండ్ అనుసరించింది.ఆమెకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక వీడియో వైరల్ గా కూడా మారింది.
ఇందులో ఆమె డ్రై ఫ్రూట్స్, నట్స్‌తో చేసిన ఆభరణాలను ధరించింది.బేబీ షవర్ వేడుకలలో ఆమె ఇలా దర్శనమిచ్చింది.
ఈ వీడియో @vasudhaa_makeover అకౌంట్ షేర్ చేసింది.దీనిని ఓపెన్ చేయగానే మనకు ఒక మహిళపై ఉన్న నగలు కనిపిస్తాయి.
"""/"/
ఆమె నెక్లెస్‌లు, కంకణాలు, చెవిపోగులు, హెయిర్‌బ్యాండ్, బెల్ట్ వంటి ఆభరణాలను ధరించింది అవి ఆకర్షణీయంగానే కనిపించాయి కానీ ఆ నగలపై బాదం, జీడిపప్పు, పిస్తా, పచ్చి ఏలకులు, ఇతర ఆహార పదార్థాలు ఉన్నాయి.
వాటిని మామూలు ఆభరణాలకు అతికించినట్లు ఉన్నారు.అవి ఆభరణాల ఆకారంలో కనిపించాయి.
మీరు వీడియోలో డ్రై ఫ్రూట్ జ్యువెలరీ ఎలా ఉందో చూడవచ్చు. """/"/
వీడియో బాగా పాపులర్ అయింది.
దీనికి 11 మిలియన్లకు పైగా వీక్షణలు ఉన్నాయి.కానీ ఈ నగలు చాలా మందికి నచ్చలేదు.
“డ్రై ఫ్రూట్ జ్యూయలరీ” ధరించడం చెడు ఆలోచన, దీంతో ఆహారం వృథా అవుతుందని కొందరు కామెంట్స్ చేశారు.
పార్టీల కోసం ఆహారాన్ని వృధా చేయకూడదని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.డ్రై ఫ్రూట్స్ బంగారం లాంటివి చాలా ఖరీదైనవని కొందరు అంటారు.
ఆకలితో ఉన్నవారు మాత్రమే ఇలాంటి నగలను ఇష్టపడతారని, ఎందుకంటే ఆకలైనప్పుడు ఆ ఆభరణాలనే తినేయగలరని మరికొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.
నాలో ఖాళీని శోభిత పూర్తి చేస్తుంది.. నాగచైతన్య కామెంట్స్ వింటే మాత్రం ఫిదా అవ్వాల్సిందే!