Ice Cream Hair Colour : ఇదేందయ్యా ఇది.. ఐస్‌క్రీమ్‌ను హెయిర్ కలర్‌గా వాడేసిన మహిళ.. చివరికి..?

ఇంటర్నెట్‌లో వివిధ సమస్యలకు సింపుల్, చీప్ సొల్యూషన్స్ అందించే వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి.

వీటిని లైఫ్ హ్యాక్ వీడియోస్( Life Hack Videos ) అంటారు.అయితే కొన్ని లైఫ్ హ్యాక్స్‌ వీడియోలు చూసేందుకు చాలా వింతగా అనిపిస్తాయి.

వాటిలో చూపించిన మెథడ్స్ ట్రై చేస్తే మంచికి బదులు ఎక్కువగా చెడే జరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది.

ఇలాంటి పిచ్చి టెక్నిక్స్ ఫాలో కావడానికి ఎవరూ కూడా ఇష్టపడరు.కానీ వ్యూస్ కోసం చాలామంది చిత్ర విచిత్రమైన హ్యాక్ వీడియోలు షేర్ చేస్తుంటారు.

తాజాగా ఒక కంటెంట్ క్రియేటర్ కూడా ఇలాంటి ఒక వెర్రి లైఫ్ హ్యాక్ వీడియో పోస్ట్ చేసింది.

"""/" / ఆ వీడియోలో ఆమె ఐస్‌క్రీమ్‌తో( Ice Cream ) జుట్టుకు రంగు( Hair Colour ) వేసుకుంది.

ఈ ఐస్ క్రీమ్ ప్రయోగం చూసి చాలామంది నోరెళ్ళ బెట్టారు.వీడియోలో ఆమె తన జుట్టుకు మూడు చాక్లెట్ ఐస్‌క్రీమ్స్‌ను రాసుకుంది, 20 నిమిషాల పాటు వేచి ఉండి దానిని వాష్ చేసింది.

ఆమె హెయిర్ కలర్ లో మార్పును చూడాలని ఆశించింది, కానీ ఆమె జుట్టు మారకుండా ఎప్పటిలాగానే నల్లగా ఉందని గుర్తించింది.

హ్యాక్ పని చేయలేదని ఆమె నిర్ధారించింది.ఆమె ప్రయోగం వికటించినా, వీడియో చాలా దృష్టిని ఆకర్షించింది.

కొంతమంది ఆమె ఆహారాన్ని వృధా చేస్తున్నారని విమర్శించగా, మరికొందరు ఆమె జుట్టు ఆరోగ్యం పాడైపోతుంది ఏమో అని ఆందోళన వ్యక్తం చేశారు.

"""/" / ఈ కంటెంట్ క్రియేటర్‌కి అలాంటి ప్రయోగాలు కొత్తేమీ కాదు.ఇంతకుముందు, ఆమె తన జుట్టుకు పసుపు పొడిని హెయిర్ కలర్ గా వాడింది.

కానీ దానివల్ల ఆమె జుట్టుకు వాటిల్లింది.ఈమెకు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు, వారిని ఆకట్టుకోవడానికే ఇలాంటి పిచ్చి హ్యాక్‌లను ఆమె ప్రయత్నిస్తోందని కొంతమంది పేర్కొన్నారు.

ఆమె రీసెంట్ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేయండి.

ఈ రెస్టారెంట్‌ మెనూ ప్రపంచంలోనే ఖరీదైనది.. ధర చూస్తే ఫ్యూజులు ఔట్.. ఎక్కడుందంటే..?