వీడియో: ఈమె తెలివి తెల్లారినట్టుంది.. టెస్లా కారుకు పెట్రోల్ కొడుతుందట..

టెస్లా( Tesla ) అనగానే మనకు ఎలక్ట్రిక్ వాహనాలే గుర్తుకు వస్తాయి.ఎందుకంటే ఈ కంపెనీ కేవలం ఎలక్ట్రిక్ కారును( Electric Car ) మాత్రమే తయారు చేస్తుంది.

కాగా ఓ మహిళ తన టెస్లా ఎలక్ట్రిక్ కారులో పెట్రోల్ పంపులో పెట్రోల్ ( Petrol ) నింపేందుకు ప్రయత్నించింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. """/" / ఈ వీడియోలో, ఒక మహిళ తన కారులో ఫ్యూయల్ ట్యాంక్ టోపీ కోసం వెతకడం గమనించవచ్చు.

ఆమె గ్యాసోలిన్ పైపు పట్టుకొని ఫ్యూయల్ హోల్ కోసం కారు చుట్టూ తిరగడం కూడా చూడవచ్చు.

ఈ కారు ఎలక్ట్రిక్‌ది అని, కేవలం రీఛార్జ్ చేయవలసి ఉందని, ఫ్యూయల్ నింపడం అవసరం లేదని ఆమె తెలుసుకోలేక పోయింది.

అయితే వెనకే ఆగి ఉన్న ఒక వాహనదారుడు ఈమె ప్రయత్నాలను చూసి స్టన్ అయ్యాడు.

తర్వాత తన ఫోన్‌లో ఈ ఫన్నీ సన్నివేశాలు రికార్డ్ చేశాడు. """/" / ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ అయింది.

దీనికి లక్షల్లో వీక్షణలు, వేలల్లో లైక్‌లు వచ్చాయి.సాధారణంగా వాహనదారుడు ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా కార్ల కంపెనీలు ఫ్యూయల్ ట్యాంక్ వద్ద డీజిల్ లేదా పెట్రోల్ అని రాస్తారు.

ఇక ఎలక్ట్రిక్ కార్లు తయారీదారులు కూడా వాహనాలపై చార్జింగ్ పోర్ట్ వద్ద ఆ వివరాలను రాసి బండిని ఛార్జ్‌ చేసేందుకు సులభతరం చేస్తారు.

అయినప్పటికీ, తన టెస్లా కారులో ఇంధనాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్న ఈ మహిళను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈమె తెలివి తెల్లారినట్టుంది అని మరికొందరు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

నీతులు చెప్పడమే కాదు పాటించాలిగా.. అనంత్ శ్రీరామ్ ఓల్డ్ సాంగ్స్ లిరిక్స్ పై విమర్శలు?