ఇదేం చోద్యం.. వైన్ తాగుతూ 5 రోజులు బతికేసిన మహిళ..
TeluguStop.com

ఆస్ట్రేలియా దేశం, విక్టోరియా( Australia ) రాష్ట్రంలోని దట్టమైన పొదల్లో తప్పిపోయిన ఒక మహిళ అద్భుతం సృష్టించింది.


48 ఏళ్ల లిలియన్ ఐప్( Lilian Ip ) అనే మహిళ ఇటీవల చిన్న ట్రిప్‌లో భాగంగా ఒకవైపు కారులో వెళ్లింది.


ఆ క్రమంలో రాంగ్ టర్న్ తీసుకొని ఐదు రోజుల పాటు దట్టమైన పొదల్లోనే చిక్కుకు పోయింది.
ట్రిప్‌కి బయలుదేరే ముందు ఈ మహిళ తన తల్లికి ఇవ్వడానికి తన కారులో ఒక వైన్ బాటిల్( Wine Bottle ) ఉంచుకుంది.
నిజానికి ఈ మహిళకు వైన్ తాగే అలవాటు లేదు కానీ అడవిలో తప్పిపోయిన తర్వాత తినడానికి ఏమీ దొరకక చివరికి వైన్ తాగింది.
"""/" /
దానివల్లే ఆమె బతికింది.కారు బురదలో కూరుకుపోవడం, అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల ఆమె ఎటూ నడవలేకపోయింది.
ఆమె తన కారు దగ్గరే ఉండిపోయింది.కారులో ఆహారం, నీరు లేవు కానీ కొన్ని స్నాక్స్, లాలీపాప్స్, వైన్ ఉన్నాయి.
ఐదు రోజులపాటు ఆమెను అవి తింటూ బతికింది.తర్వాత, ఎమర్జెన్సీ టీమ్ ఆమెను సమీప పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించింది.
విక్టోరియా పోలీసులు( Victoria Police ) తమ హెలికాప్టర్ మహిళను గుర్తించిన క్షణాన్ని చూపించే వీడియోను ట్వీట్ చేశారు.
"""/" /
ఆమెను రక్షించిన పోలీసు అధికారులు మాట్లాడుతూ, ఆమె ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించింది కాబట్టే సజీవంగా బయటపడగలిగిందని అన్నారు.
ఆమె తన కారు దగ్గరే ఉండి పొదల్లోకి వెళ్లలేదు, ఇది పోలీసులకు ఆమెను కనుగొనడంలో సహాయపడిందని వివరించారు.
రెస్క్యూ టీమ్‌ని చూసినందుకు ఆమె చాలా ఉపశమనం పొందింది.అప్పటిదాకా ఆమె తన ప్రాణాల మీద ఆశ వదిలేసుకుందట.
ఐదు రోజులపాటు ఆ పొదల్లో రాత్రి, పగలు ఆమె ధైర్యంగా ఉండటం నిజంగా మెచ్చుకోదగిన విషయమే.
ఇక కాపాడిన తర్వాత డీహైడ్రేషన్‌కి గురైన ఆమెకు చికిత్స చేయడానికి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కొన్ని గంటల్లోనే ఆమె డిశ్చార్జ్ అయింది.ఇప్పుడు ఆమె మెల్‌బోర్న్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చింది.
బన్నీ అట్లీ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ ఈమేనా.. ఈ ఆఫర్ తో దశ తిరిగినట్టే!