పిచ్చి పిక్స్, టైటానిక్ శిథిలాలు చూసేందుకు మహిళ రూ.2 కోట్లు ఖర్చు..

అస్సలు మునిగిపోదని భావించిన టైటానిక్ షిప్ ఊహించని రీతిలో మునిగిపోయి వేలాది మందిని జల సమాధి చేసింది.

నేటికీ ఈ ఓడ కథ విషాదాంతం కావడం చాలా మందిని బాధకు గురి చేస్తుంది.

అయితే టైటానిక్ సినిమా చూసిన తర్వాత అనేకమంది ప్రజలు ఈ షిప్ శిథిలాలను చూడాలని ఎంతో ఆశపడ్డారు.

కాగా ఒక మహిళ ఈ షిప్ అవశేషాలను చూడాలనే కోరికతో ఏకంగా 30 సంవత్సరాలపాటు కష్టపడి రూ.

2 కోట్ల డబ్బులు దాచుకుంది.ఇటీవల, ఈ మహిళ తన కలను నెరవేర్చుకుంది.

ఆ మహిళ తన కలను సాకారం చేసుకున్న వీడియో క్లిప్‌ను బీబీసీ షేర్ చేసింది.

రెనాటా అనే మహిళ ఈ అనుభూతి కోసం 2,50,000 డాలర్లు అనగా రూ.

2 కోట్లకు పైగా వెచ్చించింది.టైటానిక్ శిథిలాలను ప్రత్యక్షంగా వీక్షించాలనే తపన కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే ఆమెలో మొదలైందట.

మరో విశేషం ఏంటంటే, ఆ మహిళ సముద్ర శాస్త్రాన్ని కూడా కెరీర్‌గా సెలెక్ట్ చేసుకుంది.

టైటానిక్ శిథిలాలను చూసిన మొదటి వ్యక్తి తానే కావాలని కూడా కోరుకుంది.దురదృష్టవశాత్తు, ఆమె ఓషనోగ్రఫీ క్లాస్సేస్‌కి వెళ్లిన వారంలోపే, టైటానిక్ శిథిలాలు కనుగొనబడ్డాయి.

ఫలితంగా, ఆ మహిళ తన కెరీర్ మార్చుకుంది.శిథిలాలను సందర్శించడానికి పొదుపు చేయడాన్ని లక్ష్యంగా చేసుకుంది.

తన కోరికను నెరవేర్చుకోవడానికి ఆమె 30 సంవత్సరాలకు పైగా మనీ సేవ్ చేసింది.

ఇటీవల, టైటానిక్ శిథిలాలను విజిట్ చేసింది. """/"/ ఈ మహిళ టైటానిక్‌ను చూసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆమె సంకల్పానికి కొందరు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతుంటే.ఇంతలా టైటానిక్ చూడాలానేంత పిచ్చి ఈమెలో తప్ప మిగతా ఎవరిదో ఉండదేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ అద్భుతమైన వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

రూ.3 కోట్ల జీతం వదులుకున్న మహిళా న్యాయవాది.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!