ముక్కు చికిత్స కోసం వెళ్తే చెవిని కత్తిరించేశారు…పాపం!

సాధారణంగా ఒక సామెతను మనం వాడుతూ ఉంటాం.కొండ నాలుకకు మందేస్తే.

ఉన్న నాలుక ఊడిందనీ అంటూ ఉంటారు.అచ్చం ఈ సామెత ఓ మహిళ విషయంలో జరిగింది.

ముక్కు సర్జరీ నిమిత్తం ఆసుపత్రికి వెళితే ఏకంగా ఆమె చెవిని కత్తిరించిన ఘటన చైనాలో చోటుచేసుకుంది.

సర్జరీ జరిగిన తర్వాత ఆ మహిళ తన చెవిని చూసుకోవడంతో చెవిలో కొంతభాగం లేకపోయేసరికి ఆమె ఆస్పత్రి సిబ్బందిని నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.చైనాలోని జావో అనే మహిళ తన ముక్కు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మార్పు చేయించుకోవడం కోసం చెంగ్డూ‌లోని ఏంజిల్ వింగ్ హాస్పిటల్‌కు వెళ్లింది.

అయితే ఈ సర్జరీ గత ఐదు సంవత్సరాల క్రితం చేయించుకుంది.తనకు ఇప్పుడు ఇది రెండవ సర్జరీ.

ఈ నేపథ్యంలోనే ఆ మహిళకు వైద్యులు ‘రినోప్లాస్టీ’ సర్జరీ చేశారు.ఈ సర్జరీ ఎంతో విజయవంతమైనది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2020/11/Rhinoplasty-surgerywomenNose-plastic-surgeryCompensationearAngel-Wing-Hospital‌!--jpg" / ఈ సర్జరీ చేసిన కొద్దిరోజులకు ఆమె చెవిలో నొప్పి రావడంతో ఏం జరిగిందని తన చెవిని ఒకసారి చూసుకునే సరికి ఆమెకు ఊహించని షాక్ తగిలింది.

తన చెవిలో ఎత్తుగా ఉండే మృదులాస్థి భాగం లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి వైద్య సిబ్బందిని నిలదీసింది.

దీంతో వారు శరీరంలో ఏ భాగమైనా సర్జరీ చేస్తే ఇతర భాగాల నుంచి చర్మాన్ని తీసి సర్జరీ చేస్తారని తెలిపారు.

అందుకుగాను ఆ మహిళతో అంగీకార పత్రం పై సంతకం కూడా చేశారని వైద్యులు తెలిపారు.

అయితే చెవి నుంచి భాగాన్ని తొలగిస్తారనే విషయం తనకు చెప్పలేదని, తెలిస్తే ఇప్పుడెందుకు వాదిస్తానని ఆమె పేర్కొన్నారు.

దీంతో ఆమె మీడియాతో మాట్లాడుతూ, నాకు సర్జరీ విజయవంతం అయ్యింది, నా ఆరోగ్యం నిలకడగానే ఉందని, కానీ నాలుగు రోజుల తర్వాత నాకు చెవిలో నొప్పి రావడంతో తన చెవిని చూసుకుంటే చెవిలో కొంతభాగం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రోగి అనుమతిలేకుండా ఆసుపత్రి సిబ్బంది ఇలా చేయడం వల్ల మానసిక ఆవేదన చెందుతున్నానని తెలిపింది.

ఇందుకుగాను ఆసుపత్రి యాజమాన్యం తమకు నష్టపరిహారం చెల్లించాలని, అంతేకాకుండా తన చెవి భాగాన్ని కూడా సర్జరీ చేసి తిరిగి అతికించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఆంజనేయ స్వామి పుట్టుక ఎలా జరిగిందో తెలుసా..?