లెక్కల్లో సున్నా మార్కులు రావడంతో కూతురిపైన తల్లి ఎలా స్పందించిందో చూడండి!

కాలం మారుతున్నా పిల్లలపట్ల చాలామంది తల్లిదండ్రుల ప్రవర్తన మారడంలేదు.మార్కులే ప్రధాన లక్ష్యంగా ఇక్కడ కొందరు తల్లిదండ్రులు( Parents ) తమ పిల్లల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తూ వుంటారు.

వారి చిన్ని మనసుని అర్ధం చేసుకొని వారికి ఎలా చెప్పాలో ఆ రకంగా చెప్పరు.

చాలా ఒత్తిడి చేస్తూ వుంటారు.దాంతో వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేనిపోని నిర్ణయాలు తీసుకుంటూ వుంటారు.

ఇక అలాంటి పేరెంట్స్ ఈ స్టోరీని ఖచ్చితంగా చదవాల్సిందే. """/" / తాజా వైరల్ పోస్టుని చూసి చాలామంది తల్లిదండ్రులు సిగ్గు పెడతారనే అనుకోవచ్చు.

సోషల్ మీడియాలో జైనాబ్( Zainab ) అనే యువతి తన చిన్ననాటి మార్కుల షీట్‌ను షేర్ చేయగా ఆ షీట్ పై తన తల్లి రాసిన ప్రోత్సాహక వ్యాఖ్యలు ఉండడం మనం చూడవచ్చు.

రూమ్‌లో తన ఆరో తరగతి లెక్కల పుస్తకం( Mathematics Book ) కనిపించిందని, అది తెరిచి చూస్తే అందులో తనకు 15 మార్కులకు గాను సున్నా మార్కులు( Zero Marks ) వచ్చిన విషయాన్ని ప్రస్తావించింది.

అయితే.సున్నా మార్కులు తెచ్చుకున్నందుకు ఆ రోజు అమ్మ తనను కొట్టలేదని, తన మార్కులను చూసి ఆ మార్క్ షీటు పై ఓ కామెంట్ రాసిందని చెప్పుకొచ్చింది.

ఇక దానిని ఇక్కడ ఫోటోలలో మనం చూడవచ్చును. """/" / ఇంతకీ ఆ తల్లి ఏం రాసిందంటే.

'డియర్.ఈ మార్కులను స్వీకరించాలంటే చాలా ధైర్యం కావాలి.

నీకు చాలా ధైర్యం ఉన్నది!' అని తల్లి రాసిన కామెంట్‌ను ఫొటో తీసి పంచుకుంది.

తన తల్లి ఎంతమంచిదో.కూడా ఇక్కడ రాసుకొచ్చింది.

ప్రతి రోజూ తాను చాలా తక్కువ మార్కులను తెచ్చుకున్నా.తల్లి మాత్రం ప్రోత్సాహకర మాటలతో తనను ముందుకు నడిపేదని, అలా తన తల్లి ప్రోత్సాహంతో తాను ఆ తర్వాత లెక్కల్లో రాణించానని వివరించింది.

'మీ పిల్లలకు కూడా మార్కులు తక్కువ వచ్చాయని కోపగించుకోకండి.వారిని ప్రోత్సహిస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు' అని కూడా ఆ యువతి ఈ సందర్భంగా సూచించింది.

పెళ్లికి పిలిచి అతిథులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన దంపతులు..