అమెరికా(America) వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో (New York)షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.నగరంలోని సబ్ వేలో ఓ మహిళకి ఓ వ్యక్తి నిప్పంటించి.
ఆమె తగలబడుతుంటే కూర్చొని చూసి ఆనందించాడు.ఆదివారం ఉదయం 7.
30 గంటలకు బ్రూక్లిన్‌లోని స్టిల్‌వెల్ అవెన్యూ (Stillwell Avenue In Brooklyn)వద్ద లైన్ చివర ఉన్న ఎఫ్ ట్రైన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
రైలు స్టేషన్‌లో ఆగిన తర్వాత.అనుమానితుడు ప్రశాంతంగా సబ్ వే వద్ద నిద్రపోతున్న బాధితురాలి వద్దకు వెళ్లి, ఆమె దుస్తులకు నిప్పంటించగా క్షణాల్లో మంటలు ఆమె శరీరాన్ని కమ్మేశాయని పోలీసులు వెల్లడించారు.
స్టేషన్ పై లెవల్‌లో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీస్ , ఇతర అధికారులు మండుతున్న వాసనను గమనించి వెంటనే రంగంలోకి దిగారు.
అప్పటికే బాధితురాలి శరీరం పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు తెలిపారు.ఎంటీఏ ఉద్యోగి ఒకరు అగ్నిమాపక యంత్రం సాయంతో మంటలను అదుపు చేసినా అప్పటికే చాలా ఆలస్యం కావడంతో బాధితురాలు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.
"""/" /
న్యూయార్క్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఘటనాస్థలంలోనే ఉండిపోయాడు.
ఆ వ్యక్తి రైలు బండికి వెలుపల వైపు ఒక ఫ్లాట్‌ఫాం బెంచ్‌పై కూర్చొని ఆమె కాలిపోతుండటాన్ని చూసి ఆనందించాడు.
పోలీసులు విడుదల చేసిన దృశ్యాలను చూసిన ప్రజలు వెంటనే 911కి కాల్ చేసి ఎన్‌వైపీడీ న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్(New York Police Department)ని అప్రమత్తం చేశారు.
తాము అనుమానితుడిని గుర్తించినట్లు సమాచారం అందించారు.బాధితుడు , అనుమానితుడి మధ్య ఎలాంటి పరస్పర చర్య జరగలేదని ఎన్‌వైపీడీ ట్రాన్సిట్ చీఫ్ జోసెఫ్ గులోట్టా తెలిపారు.
"""/" /
బాధితురాలిని ఇంకా గుర్తించలేదని అమెరికన్ మీడియా నివేదించింది.మరోవైపు.
అనుమానితుడిని పట్టుకోవడంలో సహాయపడిన వ్యక్తులను న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రశంసించారు.
ఇలాంటి హింసాత్మక ఘటలకు మా సబ్ వేలలో స్థానం లేదని, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆడమ్స్ స్పష్టం చేశారు.
నిందితుడిని గ్వాటెమాల నుంచి వలస వచ్చిన సెబాస్టియన్‌గా గుర్తించారు.ఇతను 2018లో అరిజోనా ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లుగా పోలీసులు తెలిపారు.
హీరోగానే ఉండిపోవాలని శోభన్ బాబు రిజెక్ట్ చేసిన రోల్స్ ఇవే.. ఇంత మంచి పాత్రలు వదులుకున్నారా?