వైరల్: డీసీఎం ఢీ కొట్టినా బతికిన మహిళ.. హెల్మెట్‌యే కారణమా..?!

ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు నిలుస్తాయి.దీనిపై పోలీసులు విస్తృత ప్రచారం కూడా నిత్యం నిర్వహిస్తుంటారు.

శరీరంలో మెదడుకు తప్పా ఏ భాగానికి తగిలినా చికిత్స అందించడం ద్వారా కోలుకోవచ్చు.

అయితే మెదడుకు తగిలితే మాత్రం బ్రెయిన్ డెడ్ అవడమో, లేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంది.

తాజాగా స్కూటీ పై ప్రయాణిస్తున్న మహిళను డీసీఎం ఢీకొట్టినా ప్రాణాలతో బయటపడింది.ఇందులో ఆమె హెల్మెట్ ధరించడమే కారణం.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.h3 Class=subheader-styleరెప్పపాటులో.

/h3p కర్ణాటకలోని మంగళూరు సమీపాన పెరంపల్లిలో మంగళవారం ఓ హఠాత్పరిణామం జరిగింది.స్థానిక మనిపాల్ ప్రాంతానికి దగ్గరలో ఓ మహిళ స్కూటీపై వచ్చింది.

రోడ్డు అవతలివైపునకు వెళ్తున్న క్రమంలో ఓ బస్సు వస్తూ కనిపించింది.అయితే దాని వెనక పాల వ్యాను ఉండడం ఆమె గమనించలేదు.

బస్సు వచ్చేలోపే రోడ్డు దాటేయాలను అనుకుంది.వెంటనే అటువైపునకు బండి తిప్పగానే బస్సును ఓవర్ టేక్ చేస్తూ రెప్పపాటులో పాలవ్యాన్ వచ్చేసింది.

దీంతో ఆమె స్కూటీని బలంగా ఢీకొట్టింది.స్కూటీ ఎగిరి పడింది.

దానిపై ఉన్న ఆ మహిళ గాల్లోకి లేచి, పల్టీలు కొడుతూ రోడ్డుపై పడింది.

"""/" / H3 Class=subheader-styleస్థానికులు ఆశ్చర్యం:/h3p డీసీఎం ఢీకొట్టడంతో గాలిలో ఎగిరిపడిన ఆ మహిళకు ఏమైందో అని స్థానికులు పరుగుపరుగున వెళ్లారు.

అప్పటికే షాక్‌లో ఉన్న ఆమెను పక్కకు తీసుకొచ్చి, ఓ కుర్చీలో కూర్చోబెట్టారు.ఆమెకు మంచినీరు ఇచ్చి, సపర్యలు చేశారు.

అయితే డీసీఎం వేగంగా వచ్చి ఢీకొట్టినా, ఆమెకు కేవలం చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి.

హెల్మెట్ ఉండడంతో తలకు బలమైన గాయాలేవీ కాలేదని గమనించారు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాలు నిలుస్తాయని రుజువైందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మళ్లీ జగనే సీఎం సంబరాలకు సిద్ధం కండి అంటున్న వైసీపీ..!!