వరకట్న వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య..

మహిళలపై రోజురోజుకూ దాడులు ఎక్కువవుతున్నాయి.అత్యాచారాలు, వార కట్న వేధింపులు వంటివి నిత్యం దేశంలో ఏదో ఒక మూలన జరుగుతూనే ఉన్నాయి.

కొంతమంది వాటిని దైర్యంగా ఎదుర్కొంటుంటే మరికొంతమంది జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు.గుజరాత్ కు చెందిన ఒక మహిళా కూడా బలవన్మరణానికి పాలపండింది.

ఆత్మహత్య చేసుకునే ముందు ఒక వీడియో తీసి తన మరణానికి ఎవ్వరు కారణం కాదని చెప్పింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరానికి చెందిన ఆయేషా అనే మహిళ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఆత్మహత్య చేసుకునే ముందు తన మరణానికి ఎవ్వరూ కారణం కాదని తన ఫోన్లో తీసిన వీడియోలో చెప్పింది.

అయితే తన మరణానికి వరకట్న వేధింపులే కారణమని తెలుస్తుంది.2018 లో ఆరిఫ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆయేషా.

ఆ మరుసటి రోజు నుండే అత్తింటి వేధింపులకు గురి అవుతుంది.పెళ్లి జరిగిన రోజు నుండి భర్త, అత్తమామలు ఆయేషాను అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు.

వీరి వేధింపులు భరించలేక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.ఆయేషా బ్యాంకులో పనిచేస్తుండేది.

అత్తింటి వేధింపులు మరీ ఎక్కువవడంతో ఇంకా భరించలేక ఆయేషా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

ఆత్మహత్య చేసుకునే ముందు ఒక వీడియో రికార్డ్ చేసింది.తన చావుకు ఎవ్వరూ భాద్యులు కాదని.

ఇది పూర్తిగా తన నిర్ణయమేనని ఆమె వీడియోలో వివరించింది.సబర్మతి నది వద్దకు వెళ్లి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి.

నేను అల్లా వద్ద సురక్షితంగా ఉంటానని.నేను పోరాటం చేయాలనుకోవడం లేదు.

నా భర్త నా నుండి స్వేచ్ఛ కోరుకుంటే నేను అది తప్పకుండ ఇస్తా.

అని భావోద్వేగంగా చాలా సేపు మాట్లాడింది.తల్లిదండ్రులు ఎలాంటి తొందరపాటు చర్యలు చేయవద్దని చెబుతుండగానే ఫోన్ కట్ చేసి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

డబుల్ ఇస్మార్ట్ టీజర్ లో ఒక్కటి మిస్ అయింది.. అదేంటంటే..?