'నా భర్తను నాకు అప్పగించండి' అంటూ అత్తింటి ముందు ఓ కోడలు ఆందోళన.! అసలేమైందో తెలుసా.?

భర్త కోసం ఓ భార్య ఆందోళనకు దిగారు.తనను పెళ్లి చేసుకొని, నాలుగేళ్ల తర్వాత ఆచూకీ లేకుండా వెళ్లిపోయారని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.

ఈ ఘటన అబ్దుల్లాపురమేట్ చోటుచేసుకుంది.వివరాలలోకి వెళ్తే.

! Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ రాజిరెడ్డితో సుగుణకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.అబార్షన్ కూడా జరిగింది.

నాలుగేళ్ల క్రితం ఆర్య సమాజ్‌లో లవ్ మ్యారేజ్ చేసుకున్నామని, అప్పటి నుంచి కలిసి ఉంటున్నామని, కానీ ఇటీవల తన భర్త తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడని, నాలుగైదు రోజులు అయినా రాలేదని, దీంతో అతని కోసం తన అత్తయ్య ఇంటికి వచ్చానని చెప్పారు.

తన భర్త ఎక్కడున్నాడో చెప్పాలని తన అత్తయ్యను అడిగానని, ఆ తర్వాత వెళ్లిపోయానన్నారు.

కానీ వారు మాత్రం తనపై ఫిర్యాదు చేశారని, కొట్టడానికి వచ్చిందని, చంపడానికి వచ్చిందని ఆరోపించారని, ప్రాణహానీ ఉందని చెప్పారని, మరుసటి రోజు తన భర్త తన వద్దకు వచ్చి తన తల్లిని తిట్టావని, నీతో ఉండనని చెప్పాడని, ఇంట్లో నుంచి వెళ్లిపోయి నెల రోజులు అవుతుందని చెప్పారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఐదు రోజుల క్రితం అతని ఇంటికి వచ్చానని, మా ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటానని తన అత్తయ్యతో చెప్పానని, కానీ వారు ఇంట్లోకి రానివ్వలేదని, దీంతో వాకిట్లోనే ఉంటున్నానని చెప్పారు.

కేసు పెడితే తన భర్త తనతో ఉంటాడో ఉండడోననే భయంతో కేసు పెట్టలేదన్నారు.

మిస్సింగ్ కేసు మాత్రం పెట్టానని చెప్పారు.అంతేకాక తన భర్త ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని ఆమె తెలిపారు.

కులం వేరు కాబట్టి తనను వదిలేసుకోవాలని ఆ కుటుంబం చూస్తోందన్నారు.

మళ్లీ జనంలోకి ఏపీ సీఎం జగన్..!