వైరల్: ఆ హోటల్ పేరును ఆమె పలికిన తీరుని చూశారంటే అంతే… కడుపులు పుల్లైపోవడం ఖాయం!
TeluguStop.com
నేటి సమాజంలో సోషల్ మీడియా ఫీవర్ బాగానే వుంది.పాపులర్ కావడానికి ఇక్కడ ఎంతోమంది వింత వింత వీడియోలు చేస్తూ వుంటారు.
అలా చేయడం తప్పని తెలిసినా, ఎదుటివారు నవ్వుతారని తెలిసినా కూడా తమపని తాము చేసుకుంటూ పోతున్నారు.
ఈ క్రమంలోనే మనం అనేక వీడియోలను ఉదాహరణగా తీసుకోవచ్చు.ఓ యువతి దారుణమైన డ్రెస్ ధరించి, ఇంకా చెప్పాలంటే గుడ్డపీలికలు వంటివి కట్టుకొని ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ఓ పాటకు డ్యాన్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.
"""/" /
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి.అయితే ఈ కోవలోనే తాజాగా సోషల్ మీడియాలో( Social Media ) ఓ వీడియో వైరల్‌గా మారింది.
ఇక్కడ వీడియోని గమనిస్తే, అందులో నటించిన ఆమె చాలా హుందాగా, చదువుకొనే అమ్మాయిలా కనబడుతోంది.
కానీ ఆమె ఓ ఇంగ్లీష్ పదాన్ని( English Word ) స్పెల్ చేసే తరుణంలో దానిని ఖునీ చేసేసింది.
దాంతో నెటిజన్లు తలలు బాదుకుంటున్నారు.చూడడానికి చక్కగా చదువుకున్నదానిలా వున్నావు.
నీకేం పోయేకాలం.ఇలా అడ్డమైన వీడియోల ద్వారా ఫేమస్ కావడానికి యత్నిస్తున్నావ్! అని కామెంట్స్ పెడుతున్నారు.
"""/" /
శివ మధు అనే ఇన్స్టా వేదికగా పోస్ట్ కాబడిన ఆ వీడియో అనేకమంది చూడడం జరిగింది.
కాగా ఇందులో మొగుడు పెళ్ళాం నటించినట్టు తెలుస్తోంది.ఆ మొగుడు ఆమెని వారి వెనకే వున్న ఓ బోర్డు ని చూపించి దానిమీద వున్న వాక్యాన్ని చూపించి చదవమని చెబుతాడు.
అపుడు ఆమె దానిని విడదీసి చాలా ఫన్నీగా చదువుతుంది.దాంతో యాంటిక్ ఇండియా( Antique India ) పేరుని ఆమె 'ఆంటీకి ఇండియా' అని చదువుతుంది.
దాంతో ఆమె భర్త ఫసుక్కున నవ్వేస్తాడు.అయితే ఆ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం వారి ఇద్దరినీ చూసి నవ్వుతున్నారు.
టమాటోను పచ్చిగా తినొచ్చా.. కచ్చితంగా తెలుసుకోండి!