వావ్, వాట్ ఏ టాలెంట్.. ఈ ఆర్టిస్ట్ వీడియో చూస్తే మతిపోతుంది..

ఈ ప్రపంచంలో ఆర్టిస్టులకు ( Artists ) కొదవ లేదు.అయితే కొంతమంది ప్రతిభను చూస్తే మనం అబ్బురపడక తప్పదు.

ఎంత గొప్ప నాయకుని అన్ని వారు ఎలా సాధించారని మనల్ని మనం ప్రశ్నించుకోకుండా ఉండలేం కూడా.

అలాంటి ఆర్టిస్టుల టాలెంటెడ్ వీడియోలు చాలా అరుదుగా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.అలాంటి అరుదైన వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్ గా మారింది.

@TheFigen అనే ప్రముఖ ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసిన ఆ వీడియోకు ఇప్పటికే 13 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఒక సౌత్ ఏషియన్ లేడీ ఒక గోడ పై మెత్తటి మట్టిని పోయడం చూడవచ్చు.

ఆ తర్వాత దానిని చైనా వాల్( China Wall ) లాగా మోల్డ్ చేయడం గమనించవచ్చు.

"""/" / చైనా గోడమీద ఎలాంటి మెట్లు అయితే ఉంటాయో వాటిని ఈ ఆర్టిస్టు చాలా చక్కగా రీక్రియేట్ చేసింది.

ఆ తర్వాత చాలా చక్కగా కలర్స్ వేసి ఆకాశం, పచ్చని చెట్లు, గోడ స్పష్టంగా కనిపించేలాగా చేసింది.

అలా సేపు కష్టపడ్డాక ఆమె కొంచెం కూడా లోపం లేని అద్భుతమైన చైనా వాల్ పెయింటింగ్( China Wall Painting ) సృష్టించింది.

"""/" / చూసేందుకు ఇది కెమెరాతో ఫోటో తీసినంతగా లేదా దగ్గర్నుంచి నిజంగా చైనా వాలే చూసినంతగా అద్భుతంగా కనిపించింది.

మొత్తం మీద ఈ పెయింట్ చాలామందిని ఆకట్టుకుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లలో చాలామంది ఈ ఆర్ట్ అమేజింగ్ అని కామెంట్లు చేశారు.

ఈమెకు చాలా గొప్ప స్కిల్స్ ఉన్నాయని మరికొందరు పేర్కొన్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

మీ జుట్టు పొడుగ్గా పెరగాలా.. అయితే ఈ సీరంను ట్రై చేయండి!