ఆన్‌లైన్‌లో ఎగ్ బర్గర్‌ని ఆర్డర్... ప్యాకెట్ విప్పి చూసేసరికి..

ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది.ఆహారం నుండి పానీయాల వరకు ప్రజలు తమకు అవసరమైనవాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు.

అయితే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు మోసాలు కూడా జరుగుతున్నాయి.ఒక మహిళకు ఇలాంటి అనుభవం ఎదురయ్యింది.

ఆ వివరాలు తెలిస్తే తెగ ఆశ్చర్యపోతారు.ఆ మహిళ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసింది.

అది రాగానే ప్యాకెట్ విప్పి లోపల చూసేసరికి ఆమెకు ప్రాణాలు పోయినంత పనయ్యింది 'ది సన్' రిపోర్టు ప్రకారం, ఆ మహిళ పేరు కిమ్ కరిఖా, ఆమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు.

తనకు ఆకలిగా అనిపించి, ప్రముఖ బ్రాండ్ నుండి ఎగ్ బర్గర్‌ను ఆర్డర్ చేసినట్లు ఆ మహిళ తెలిపింది.

ఆర్డర్ ఇంటికి రాగానే ఆతృతగా దానిని తినేందుకు ప్యాకెట్ విప్పి చూసింది.అయితే అది అసహ్యంగా ఉంది.

దీంతో ఆమె వాంతి చేసుకుంది.గుడ్డులోని పసుపు భాగం బూడిద రంగులోకి మారిందని, అందులో వ్యర్థాలు కూడా ఉన్నాయని ఆ మహిళ చెప్పింది.

ఇది చూసిన ఆ మహిళ అనారోగ్యం పాలయ్యింది.ఈ విషయాలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇది కలకలం రేపింది.మహిళ ఆరోపణపై, కంపెనీ వివరణ ఇచ్చింది.

ఆ ఆహారం చెడిపోలేదని, అయితే రసాయన చర్య వల్ల గుడ్డులోని పచ్చసొన రంగు బూడిద రంగులోకి మారిందని కంపెనీ చెబుతోంది.

అయితే బర్గర్ రుచి చాలా దారుణంగా ఉందని ఆ మహిళ చెబుతోంది.కంపెనీ తనకు ప్రత్యామ్నాయ ఆహారం కూడా ఇచ్చిందని, ఆ ఆఫర్‌ని తిరస్కరించానని తెలిపింది.

ఎందుకంటే ఆ గుడ్డు పరిస్థితి చూస్తే మళ్లీ బర్గర్ తినాలని ఎవరికీ అనిపించదని ఆమె వ్యాఖ్యానించింది.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.