కెనడా వెళ్లేందుకు భర్తను వాడుకుని… బయటపడ్డ భార్య బండారం , పాతిక లక్షలు కుచ్చుటోపి

ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.

ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్తున్నారు.

చట్టప్రకారం అన్ని నిబంధనలు పాటించిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు.కానీ ఇవి తెలియనివారు , నిరక్ష్యరాస్యులు మోసగాళ్లు, ట్రావెల్ ఏజెంట్ల బారినపడి చిక్కుల్లో పడుతున్నారు.

విదేశాలలో స్థిరపడాలని భావించే వారి అవసరాన్ని అలుసుగా తీసుకుని కేటుగాళ్లు మాయమాటలతో అందినకాడికి దోచుకుంటున్నారు.

"""/" / వీరిని సందర్శకుల పేరిట ట్రావెల్‌ ఏజెంట్లు విదేశాలకు తరలించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.

గడువు ముగిసిన తర్వాతా వీరు అక్కడే ఉండిపోతున్నారు.అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో వీసాలు, పాస్‌పోర్టులు లేనివారు రహస్యంగా జీవిస్తున్నారు.

భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని అక్కడి సంస్థలు, యజమానులు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.

నిత్యం ఇలాంటి వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి.అయితే ఈ కేసులో స్వయంగా భర్తను భార్యే మోసం చేసింది.

"""/" / వివరాల్లోకి వెళితే.తమ ఇంటి మహిళను విదేశాలకు పంపేందుకు రూ.

25 లక్షలు మేర మోసానికి పాల్పడిన ఒకే కుటుంబంలోని ఆరుగురిపై పట్టి నగర పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితులను జస్కరన్‌దీప్ కౌర్,( Jaskarandeep Kaur ) ఆమె తండ్రి బిక్రమ్ జిత్ సింగ్, మామ కుల్విందర్ సింగ్, సోదరుడు గురుశరణ్ పాల్ సింగ్, తాత గుర్బచన్ సింగ్, గురుదేవ్ సింగ్‌గా గుర్తించారు.

నిందితురాలు జస్కరన్ దీప్ కౌర్.పట్టి నివాసి అయిన గురుచరణ్ సింగ్( Gurcharan Singh ) తనకు ఇచ్చిన రూ.

25 లక్షల సాయంతో కెనడా వెళ్లాలని పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో జస్కరన్ దీప్ కౌర్.

గురుచరణ్ సింగ్ కుమారుడు రాజ్ కరణ్ సింగ్‌ని( Rajkaran Singh ) వివాహం చేసుకున్నట్లు చెప్పారు.

మూడేళ్ల క్రితం అతనిని కెనడాకు పిలిపించింది.కానీ కొంత సమయం తర్వాత కెనడియన్ పీఆర్ పొందేందుకు అతనికి సాయం చేయడానికి నిరాకరించింది.

దీంతో గురుచరణ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీనిపై కేసు నమోదు చేశారు పట్టి పోలీసులు.

జస్కరన్ దీప్ కెనడాలో స్థిరపడగా.మిగిలిన నిందితులు పట్టిలోనే ఉన్నారు.

పరారీలో ఉన్నవారిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని చెప్పారు.

ర‌క్త‌దానం ప్ర‌యోజ‌నాలేంటి.. ఎవ‌రు చేయాలి? ఎవ‌రు చేయ‌కూడ‌దు?