షాపింగ్ బ్యాగ్ నుంచి టాప్ తయారుచేసిన యువతి.. దాన్ని ఎలా వేసుకుందో చూడండి…
TeluguStop.com
సోషల్ మీడియాలో చాలా వెరైటీ వీడియోలు వైరల్ అవుతుంటాయి.కొన్ని వీడియోలు చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంటాయి.
మరికొన్ని వీడియోలు చూసిన తర్వాత కంటెంట్‌ను ప్రశంసించాలా లేదా కంటెంట్ క్రియేటర్‌ను ట్రోల్ చేయాలా అనేది అర్థం కాదు.
తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో( Instagram ) చక్కర్లు కొడుతోంది.ఇది చూసి కొందరు వాటే ఐడియా అంటుంటే, మరికొందరు ఇదేం ఐడియా బాబోయ్ అని షాక్ అవుతున్నారు.
"""/" /
ఈ వైరల్ వీడియోలో ఒక యువతి ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగ్‌ను( Plastic Shopping Bag ) తన టాప్ డ్రెస్ లాగా తయారు చేసుకుంది.
ప్లాస్టిక్ సంచిని క్రాప్ టాప్‌గా( Crop Top ) లా అట్రాక్టివ్ గా మార్చాలో స్టెప్ బై స్టెప్ కూడా ఆమె తెలిపింది.
ఆ తర్వాత దానిని వేసుకుంది.ఈ క్రాప్ టాప్ చూస్తుంటే ఎవరికైనా అది ప్లాస్టిక్ బ్యాగ్ కాదని ఫ్యాబ్రిక్ టాప్ అనే అనిపిస్తుంది.
ఆ యువతి మొదట క్రాప్ టాప్ తయారు చేయబోయే షాపింగ్ బ్యాగ్‌ని( Shopping Bag ) తన ఫాలోవర్లకు చూపించినట్లు వీడియోలో చూడవచ్చు.
దీని తర్వాత, ఆమె క్రాప్ టాప్ చేసే ప్రక్రియ మొత్తాన్ని కెమెరాలో రికార్డ్ చేస్తుంది.
దానిని దారంతో ఒక బట్టను కుట్టినట్లు కుట్టింది. """/" /
చాలా కష్టపడి యువతి క్రాప్ టాప్ డిజైన్ చేయడంలో విజయం సాధించింది.
ఈ క్రాప్‌టాప్ ప్లాస్టిక్‌తో చేసినప్పటికీ.ఓ అమ్మాయి దానిని ధరించి ప్రదర్శించడంతో అందరూ అవాక్కయ్యారు.
అమ్మాయి షాపింగ్ బ్యాగ్‌ని క్రాప్ టాప్‌గా అందంగా మార్చేసింది.అమ్మాయి అదే షాపింగ్ బ్యాగ్ నుండి క్లచ్ కూడా తయారు చేసింది, అది క్రాప్ టాప్‌తో బాగుంది.
Jacob అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు.దానిని మీరు కూడా చూసేయండి.
అట్లీ లుక్ పై కామెంట్లు చేసిన బాలీవుడ్ కమెడియన్.. ఈ బాలీవుడ్ నటుల తీరు మారదా?