బ్రా కారణంగా కోమాలోకి వెళ్లిపోయిన మహిళ.. షాకింగ్ రీజన్ తెలిసి..

సాధారణంగా ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు కోమాలోకి( Coma ) వెళ్లిపోతుంటారు.

కానీ సిల్వియా హాల్క్రో (53)( Sylvia Halcrow ) మహిళ మాత్రం బ్రా కారణంగా కోమాలోకి వెళ్ళింది.

వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇది నిజం.ఈ మహిళకు బ్రా కారణంగా( Bra ) రొమ్ముపై స్క్రాచ్ ఏర్పడింది.

ఆ మచ్చ ద్వారానే మాంసం తినే బ్యాక్టీరియా ఆమె శరీరంలోకి సంక్రమించింది.బ్యాక్టీరియా( Bacteria ) త్వరగా వ్యాపించడంతో సదరు మహిళ శరీరం బాగా డ్యామేజ్ అయింది.

అప్పటికి ఆమె ఎలాంటి వైద్యం తీసుకోలేదు, చివరికి ఆమె కోమాలోకి వెళ్లింది. """/" / వైద్యులు ఆమె రొమ్ము భాగాన్ని తొలగించాల్సి వచ్చింది, ఆమె శరీరంపై సర్జరీ తర్వాత భారీ మచ్చ ఏర్పడింది.

ఈ సంగతి తెలుసుకొని చాలామంది షాక్ అవుతున్నారు.బ్రా వల్ల ఇలాంటి సమస్యలు కూడా వస్తాయా అని దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

నెక్రోటైజింగ్ ఫాసిటిస్( Necrotizing Fasciitis ) అనేది మాంసాన్ని తినే వ్యాధి, ఇది ప్రాణాంతకం.

ఈ వ్యాధికి ఆసుపత్రిలో త్వరగా చికిత్స అవసరం.ఈ వ్యాధి వచ్చిన వారిలో సాధారణంగా వాపు, జ్వరం, అలసట, తలనొప్పి కలుగుతుంది అలాగే ప్రభావిత ప్రాంతం చుట్టూ సన్సేషన్ ఫీలింగ్ కోల్పోవడం జరుగుతుంది.

"""/" / తరువాతి లక్షణాలలో గందరగోళం, అతిసారం, వాంతులు, చర్మంపై ఊదా, నలుపు లేదా బూడిద రంగు మచ్చలు లేదా బొబ్బలు ఉంటాయి.

నెక్రోటైజింగ్ ఫాసిటిస్ వాతావరణంలో నివసించే బ్యాక్టీరియా సమూహం వల్ల వస్తుంది.ఇది ఒక కోత, స్క్రాప్ లేదా కీటకాల కాటు వంటి చర్మంలో రంధ్రం ద్వారా శరీరంలోకి ప్రవేశించవచ్చు.

ఇది శరీరంలోని చీము సోకిన ప్రాంతం నుంచి కూడా వ్యాపిస్తుంది, బాక్టీరియా త్వరగా రెట్టింపు అవుతూ, కణజాలానికి హాని కలిగించే టాక్సిన్‌లను( Toxins ) విడుదల చేస్తుంది.

వ్యాధి వేగంగా అభివృద్ధి చెందుతుంది, వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు.

ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?