గుండ్రని గుడ్డును ఎప్పుడైనా చూశారా..? దీని ధర ఎంతంటే..?
TeluguStop.com
గుడ్లల్లో( Eggs ) అనేక రకాల కోడిగుడ్లు ఉంటాయి.బాయిలర్ కోడిగుడ్లతో పాటు నాటుకోడి గుడ్లు ఉంటాయి.
గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.గుడ్లు తినడం వల్ల శరీరానికి ప్రోటీన్ వస్తుంది.
అలాగే అనేక పోషక విలువలు గుడ్డులో ఉంటాయి.దీంతో డైట్ చేసేవారు కచ్చితంగా రోజుకి ఒక కోడి గుడ్డు అయినా తింటారు.
గుడ్ల ధరలు చాలా తక్కువకి లభిస్తుండటంతో సామాన్యులు కూడా కొనుగోలు చేసి తింటూ ఉంటారు.
అయితే తాజాగా కోడి గుడ్డుకి సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.
"""/" /
ఒక కోడి గుడ్డు గుండ్రటి ఆకారంలో( Round Egg ) ఉంది.
చూడటానికి చాలా వినూత్నంగా ఉండటంతో ఈ గుడ్డు ధర వేలల్లో పలుకుతోంది.
సాధారణ సూపర్ మార్కెట్‌లో ఒక మహిళ ఈ కోడిగుడ్డును కొనుగోలు చేసింది.అయితే ఈ గుండ్రటి గుడ్డును చూసి ఆశ్చర్యపోయింది.
దీనికేదో ప్రత్యేకత ఉందనుకుని గుడ్డును వేలం పాటలో ఉంచింది.దీంతో గుడ్డును కొనుగోలు చేసేందుకు చాలామంది వేలం పాటలో పాల్గొన్నారు.
దీంతో ఈ గుడ్డు ఏకంగా రూ.78 వేలకు వేలం పాటలో అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
"""/" /
ఆస్ట్రేలియాకు( Australia ) చెందిన ఒక మహిళ మెల్‌బోర్న్‌లోని ఒక సూపర్ మార్కెట్‌కి వెళ్లి గుడ్లు కొనుగోలు చేసింది.
అయితే ఇంటికి వెళ్లిన తర్వాత గుడ్లను చూడగా.ఒక గుడ్డు గుండ్రంగా ఉండటంతో జాక్వెలిన్ ఫెల్గేట్ అనే మహిళ దీనికి వేలం పాటలో పెట్టింది.
వింత ఆకారంలో దీనిని సొంతం చేసుకునేందుకు చాలామంది పోటీ పడ్డారు.ఈ గుండ్రటి గుడ్డుకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక దెబ్బతో మహిళ పంట పండిందని, జాక్‌పాట్ కొట్టిందని చాలామంది చెబుతున్నారు.ఏదైనా అదృష్టం ఉండాల్సిందేనంటూ మరికొందరు కామెంట్ చేస్తోన్నారు.
ఆ విధంగా రికార్డ్ సృష్టించబోతున్న టీడీపీ