100ఏళ్ల కిందటి డైరీ మిల్క్ కవర్ చూడండి… ఎలా వుందో?

క్యాడ్‌బరీస్ డైరీ మిల్క్ గురించి జనాలకి పరిచయం చేయవలసిన అవసరం లేదు.ముఖ్యంగా యువతకి, అందులోనూ ఆడవాళ్ళకి క్యాడ్‌బరీస్ డైరీ మిల్క్ గురించి చెప్పాల్సిన పనిలేదు.

ప్రపంచంలో ఏ ఆడవాళ్ళనైనా ప్రధానంగా ఆకర్శించే చాక్లెట్ క్యాడ్‌బరీస్ డైరీ మిల్క్.అందువల్లనే ప్రపంచ వ్యాప్తంగా చాక్లెట్లలో డెయిరీ మిల్క్ అగ్రస్థానంలో ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.

అయితే.క్యాడ్‌బరీస్ నుంచి వచ్చిన అతి కొద్ది ఉత్పత్తులలో డైరీ మిల్క్ ఒకటి.

బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ దీనికి సాక్ష్యంగా నిలిచింది.యాభై ఏడేళ్ల ఎమ్మా యంగ్ 100 ఏళ్ల నాటి డైరీ మిల్క్ చాక్లెట్ బార్ కవర్‌ను కనుగొంది.

"""/" / తమ ఇంటికి మరలా మరమ్మత్తులు చేస్తుండగా చాలా ఏళ్ల నాటి చాక్లెట్ కవర్ కనిపించింది.

అయితే ఇన్నాళ్లూ అది చెక్కుచెదరకుండా ఎలా ఉందనేది వారికి ఆశ్చర్యం కలిగించింది.వారి ఇంటి బాత్‌రూమ్‌లోని ఫ్లోర్‌బోర్డ్‌లను తీసివేసినప్పుడు దాని కింద అది ఉందని ఎమ్మా చెప్పింది.

దుమ్ముతో కప్పబడిన కార్డ్‌బోర్డ్‌లను శుభ్రం చేసినప్పుడు, పురాతనమైన డైరీ మిల్స్‌ కవర్ కనిపించింది.

ఎమ్మా దానిని పాడవకుండా బయటకు తీసి స్వయంగా చాక్లెట్ తయారీ కంపెనీని ఆశ్రయించారు.

పరీక్షించిన తర్వాత, అది 1930 మరియు 1934 మధ్య ఉత్పత్తి చేయబడిన చాక్లెట్ కవర్ అని వారు నిర్ధారించారు.

"""/" / కాగా చాక్లెట్ కవర్ వయస్సు తెలుసుకుని ఎమ్మా అవాక్కయింది.ఆ ఘటన ఓ చరిత్ర అని వారికి అపుడు అర్థమైంది.

ఇప్పుడు వారు ఈ కవర్‌ను ఫ్రేమ్ చేసి శుభ్రంగా దాచుకోవాలని నిర్ణయించుకున్నారు.మీడియాతో ఆమె స్పందిస్తూ.

తాను చాక్లెట్ ప్రియురాలని, అందుకే ఈ ‘సర్‌ప్రైజ్’ తనకు చాలా స్వీట్‌గా ఉందని చెప్పడం గమనార్హం.

అదే సమయంలో, ఈ అసాధారణ సంఘటన తమను ఆశ్చర్యానికి మరియు సంతోషానికి గురి చేసిందని క్యాడ్‌బరీ సంస్థ కూడా తెలియజేసింది.

క్యాడ్‌బరీ కంపెనీ దాదాపు 200 ఏళ్ల నాటిది.కంపెనీ డైరీ మిల్క్‌ సహా అనేక ఉత్పత్తులను కలిగి ఉంది.

ఈ ఆహారాలు తింటే బ్రెస్ట్ క్యాన్స‌ర్ రిస్క్ త‌గ్గుద‌ట‌.. తెలుసా?