ఇంత ట్యాలెంటెడ్ గా ఉన్నావేంటి బ్రో.. ఫ్యాన్‌ రిపేర్‌ కోసం వచ్చి అమ్మాయిని ప్రేమలో పడేసావుగా!

ప్రేమ( Love ) అనేది ప్లాన్‌ చేస్తే వచ్చేది కాదు.ప్రేమ పలాన టైమ్‌కి పలాన వ్యక్తితో పుడుతుంది ఎవరికీ తెలియదు.

అనే డైలాగ్‌ ఒక సినిమాలో వచ్చినా, ఆ మాటలలో దాగిన సత్యం చాలామంది అనుభవించే ఉంటారు.

ఆస్తి, కులం, మతం, ప్రాంతం వంటి వ్యవస్థలు ప్రేమకి అడ్డు రావు.ప్రేమ ఒకసారి పుట్టిందంటే అది మనిషి మనసును పూర్తిగా మార్చేస్తుంది.

ఈ తరహాలోనే, బిహార్‌లో( Bihar ) చోటు చేసుకున్న ఓ వినూత్న ప్రేమ వివాహం ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

మామూలుగా ఎవ్వరూ ఊహించని స్థితిలో ప్రేమ ప్రారంభమై, చివరకు మూడు ముళ్ల బంధంగా ముగిసిన ఈ కథ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

"""/" / బిహార్‌ లోని ఓ గ్రామానికి చెందిన యువతి ఇంట్లో ఫ్యాన్‌ పాడవడంతో, ఓ ఎలక్ట్రిషియన్‌ను( Electrician ) రిపేర్‌ చేయమని పిలిపించింది.

అతను తన పని పూర్తిచేసి వెళ్లిపోయాడు.అయితే, అదే తొలిచూపు యువతి మనసును దోచేసింది.

మొదటి చూపులోనే అతనిపై ప్రేమ కలిగిందని యువతి చెబుతోంది.అతని ఫోన్‌ నంబర్‌ను తీసుకుని, అప్పటి నుంచి చిన్న చిన్న కారణాలతో ఇంటికి పిలవడం ప్రారంభించింది.

ఫ్యాన్‌, లైట్‌, డిష్‌, ఇలా రకరకాల పాడైన వస్తువుల పేరుతో తరచూ అతనిని ఇంటికి పిలుచుకునేది.

అలా పరిచయం ప్రేమగా మారి, చివరికి వారు ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

"""/" / వివాహం అనంతరం స్థానిక మీడియాతో జంట మాట్లాడారు.ఇందులో ఎలక్ట్రిషియన్‌ మాట్లాడుతూ.

తొలిసారి ఇంటికి వెళ్లినప్పుడు, ఆమె నన్ను గమనించిందని నాకు అర్థం కాలేదు.తర్వాత తరచూ ఫోన్‌ కాల్స్ రావడం మొదలయ్యాయి.

ఒక రోజు నేరుగా మెసేజ్‌ కూడా చెసిన్ది తెలిపింది.అలాగే ఆ అమ్మాయి మాట్లాడుతూ.

ఆయనను చూస్తూనే ప్రేమ కలిగింది.ఏదో ప్రత్యేకత అనిపించింది.

నెమ్మదిగా మాటలతో ప్రేమ బలపడింది.చివరకు పెళ్లిగా మారిందని తెలిపింది.

ప్రస్తుతం ఈ ప్రేమకథ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.వీరిద్దరు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నిజమైన ప్రేమకు వ్యవస్థలు, పొజిషన్లు, సంబంధాలు అడ్డుకాదని మరోసారి నిరూపించిన ఉదాహరణగా ఈ జంట నిలిచారు.