కరోనా పాజిటివ్ వచ్చిందని కన్న బిడ్డ ని ఆసుపత్రిలోనే వదిలిపెట్టిన తల్లి…

ప్రస్తుత కాలంలో కొందరు కరోనా వైరస్ గురించి సరైన అవగాహన లేకపోవడంతో పలు అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 తాజాగా ఓ మహిళ ప్రసవించిన రెండు రోజులకే బిడ్డకి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని ఏకంగా ఆసుపత్రిలోనే వదిలి పెట్టి పరారైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఇటీవలే ఢిల్లీ నగరానికి చెందినటువంటి ఓ మహిళ ప్రసవం కోసం స్థానికంగా ఉన్నటువంటి ఓ ఆసుపత్రిలో చేరింది.

దీంతో నిన్నటి రోజున ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ప్రసవించిన తర్వాత వైద్యులు మహిళ కి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజిటివ్ అని తేలింది.

దీంతో మహిళ తన కన్న బిడ్డని కూడా చూడకుండా శిశువుని ఆసుపత్రిలోనే వదిలి పెట్టి తన బంధువులతో సహా పరార్ అయింది.

దీంతో వైద్యాధికారులు శిశువుకి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని తేలింది.

సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మహిళలను గుర్తించి అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అంతేకాక ఈ విషయంపై స్పందించిన  కొందరు నెటిజన్లు కరోనా వైరస్ కి భయపడి తన కడుపున పుట్టిన బిడ్డను సైతం వదిలిపెట్టి కనికరం లేకుండా పరారైన  ఆ కసాయి తల్లి ఎలాగైనా పట్టుకుని తను చేసినటువంటి తప్పును తెలియజేసి బిడ్డని తల్లిదండ్రుల  చెంతకి చేర్చాలని పోలీసులను కోరుతున్నారు.

  అలాగే ఈ విషంపై స్పందించిన వైద్యులు కరోనా వైరస్ గురించి లేనిపోని భయందోళనలకి గురి కావద్దని అంటున్నారు.

   .

ఫ్లాట్ ఎర్త్ నిజమా.. 31 లక్షలు ఖర్చు చేసి యూట్యూబర్ ఏం కనుక్కున్నాడో చూడండి