3 గంటల్లోనే రూ.4 లక్షలు సంపాదించిన యువతి.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..
TeluguStop.com
ఈ రోజుల్లో నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తేనే వామ్మో అంత డబ్బులు ఎలా సంపాదిస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
అంటే రోజులో రూ.3- 4 వేలు సంపాదిస్తేనే అది గ్రేట్ అన్నమాట.
అదే రూ.3-4 లక్షలు వెనకేయాలంటే చాలా నెలలు కష్టపడాలి.
కానీ ఒక సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్(
Social Media Strategist ) మాత్రం జస్ట్ మూడు గంటల్లోనే రూ.
4 లక్షలు సంపాదించింది.ఈ విషయాన్ని ఆమె సగర్వంగా సోషల్ మీడియాలో చెప్పుకుంది.
తనకు విదేశీ కస్టమర్ ఒకరు భారీ మొత్తంలో డబ్బు చెల్లించారని చెప్పింది.ఆమె కేవలం మూడు గంటలు పని చేసి లక్షల్లో రూపాయలు సంపాదించానని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ ద్వారా తెలియజేసింది.
ఆమె "ఈ నెలలో నాకు ఒకే ఒక్క కస్టమర్ నుంచి రూ.4,40,000 (5,200 డాలర్లు) అమౌంట్ లభించింది.
ఆయన సోషల్ మీడియా స్ట్రాటజీ కోసం నేను కేవలం 3 గంటలు మాత్రమే పని చేశాను.
" అని తన పోస్టులో తెలిపింది.ఆమె పోస్ట్ చాలా వేగంగా వైరల్ అయింది.
ఇందుకు ప్రతిస్పందిస్తూ, ఒక వ్యక్తి, "వావ్, కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్లకు ఇంత జీతం కూడా రాదే!" అని అన్నారు.
మరొకరు, "ఇది చాలా అద్భుతం, మీరు ఇంకా ఎంతో ఎదగాలని కోరుకుంటున్నాను" అని అభినందించారు.
"""/" /
ఇంతకీ అంత డబ్బులు సంపాదించింది ఎవరంటే శ్వేతా కుక్రేజ( Shweta Kukreja ).
ఈమె సోషల్ మీడియాలో ఎవరినైనా పాపులర్ చేయగలదు.ఆమె ఫ్రీ లాన్సింగ్ వెబ్‌సైట్స్ ద్వారా తన సర్వీసులను ఆఫర్ చేస్తుంది.
అలా పని చేస్తూనే ఒకరోజు ఒక్క కస్టమర్ నుంచి 5,200 డాలర్లు అంటే దాదాపు 4,40,000 రూపాయలు సంపాదించింది.
ఈ విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.ఎందుకంటే, ఎవరైనా అంత డబ్బు సంపాదించాలంటే చాలా రోజులు పని చేయాలి అని అనుకుంటారు.
శ్వేతా కుక్రేజ తన బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బు జమ అయిన స్క్రీన్‌షాట్‌ని కూడా చూపించింది.
అందులో 4,41,862.40 రూపాయలు జమ అయినట్లు కనిపిస్తోంది.
ఆమె ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, "ఇలాంటి రోజులు నా పనిని ఇంకా ఆనందంగా, విలువైనదిగా చేస్తాయి" అని రాసింది.
"""/" /
శ్వేతా పోస్ట్ పై చాలా మంది రిప్లైలు కామెంట్లు చేశారు.
ఒకరు, "ఒక్క కస్టమర్ నుంచి ఇంత డబ్బు వచ్చిందా! అద్భుతం" అని అన్నారు.
మరొకరు, "ఇది చూస్తుంటే నేను నా ఉద్యోగం వదిలేయాలనిపిస్తోంది" అని రాశారు.కొంతమంది, ఆమె ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వల్ల ఆమె గురించి చాలా మందికి తెలిసింది అని చెప్పారు.
అంతేకాకుండా, ఆమె ఎంత ప్రతిభావంతురాలో, ఆమె పని ఎంత విలువైనదో కూడా ఇతరులకు తెలిసింది అని అన్నారు.
ఒకరు, "మీరు ఎంత అద్భుతమైన బిజినెస్ ని నిర్మించారు" అని అన్నారు.మరొకరు, "ఇది చాలా తెలివైన మార్కెటింగ్ స్ట్రాటజీ" అని అన్నారు.
అమ్మో, గడ్డకట్టిన సరస్సుపై కుక్క.. ప్రాణాలకు తెగించి రక్షించిన భారతీయుడు..