వీడియో కాల్‌లో భర్త ఉండగా ఫోన్‌ని పుణ్యజలాల్లో ముంచేసిన భార్య.. వీడియో చూస్తే నవ్వాగదు..

మహా కుంభమేళా( Maha Kumbhmela ) చాలా రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

సాధారణంగా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు తండోప తండాలుగా వచ్చి పుణ్య స్నానాలు చేస్తారు.

కానీ ఈ మహిళ మాత్రం కొంచెం వెరైటీగా ట్రై చేసింది.ఈమె లైవ్ వీడియో కాల్‌లో( Live Video Call ) మొగుడు ఉన్నాడు కదా అని ఏకంగా ఫోన్‌నే ముంచేసింది పుణ్య జలాల్లో.

అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ పుణ్య స్త్రీ త్రివేణి సంగమంలో స్నానం చేస్తుంటే, తన ఆయనకి వీడియో కాల్ చేసిందట.

పుణ్యం ఆయనకు కూడా దక్కాలనే ఉద్దేశంతోనో, లేక పోన్ కూడా పవిత్రం కావాలని అనుకుందో ఏమో తెలీదు కానీ టపీమని ఫోన్‌ని పుణ్య జలాల్లో ముంచేసింది.

గంగ, యమున, సరస్వతి నదుల కలయికలో ఫోన్ స్నానం చేస్తూంటే ఆ సీన్ మాత్రం అదుర్స్ అనిపించింది.

మహా కుంభమేళాలో ఇంతకంటే ఫన్నీ మూమెంట్ ఇంకేం కావాలి అని నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

"""/" / ఇన్‌స్టాగ్రామ్‌లో స్వాతి చౌహాన్( Swati Chouhan ) అనే యూజర్ ఈ వీడియోని షేర్ చేసింది.

ఆమె ఈ వీడియో చూసి గట్టిగా నవ్వుకుంది.ఎందుకంటే, ఈమె చేసిన పని చూస్తే ‘సాథ్ నిభానా సాథియా’ సీరియల్‌లో గోపి కోడలు గుర్తొచ్చిందట.

ఆ సీరియల్‌లో గోపి కోడలు ఖాళీ కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టి మంట పెడుతుంది.

అచ్చం అలాంటి పనే ఈ పుణ్య స్త్రీ చేసిందని స్వాతి పోస్ట్ పెట్టింది.

"గోపి కోడలు ఇన్ ప్రేయగ్‌రాజ్" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.అంతే కాదు, "కిత్నే తేజస్వి లోగ్ హై హమారే దేశ్ మే" అనే ఫేమస్ మీమ్ డైలాగ్‌ని కూడా వాడేసింది.

"""/" / నెటిజన్లు అయితే ఈ వీడియో చూసి పగలబడి నవ్వారు.24 వేల వ్యూస్ దాటిపోయింది వీడియో అంటేనే అర్థం చేసుకోవచ్చు.

కొందరు "ఫోన్ వాటర్‌ప్రూఫా?" అని డౌట్ పడ్డారు.మరికొందరు మాత్రం ఆమె భక్తికి జై కొట్టారు.

ఒక నెటిజన్ అయితే ఫన్నీ కామెంట్ పెట్టాడు."హ్యాట్సాఫ్ మేడం మీకు.

ఇదే భారతీయ మహిళ అంటే.భర్త మీద ఎంత ప్రేమ చూడండి.

" అని పొగిడేసాడు.మీమ్స్, ఫన్నీ కామెంట్స్‌తో సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోయింది.

మొత్తానికి ఈ పుణ్య స్త్రీ చేసిన పని మాత్రం నెటిజన్లకు ఫుల్ మీల్స్ పెట్టినంత పని చేసింది.

ప్రమాదం నుంచి బయటపడిన సోనుసూద్ భార్య… కాపాడింది ఇదే అంటూ పోస్ట్!