నడిరోడ్డుపై నరకం.. ఫోన్ లాక్కోబోయి మహిళను ఈడ్చుకుంటూ పోయాడు.. వీడియో వైరల్

నడిరోడ్డుపై నరకం ఫోన్ లాక్కోబోయి మహిళను ఈడ్చుకుంటూ పోయాడు వీడియో వైరల్

పంజాబ్‌లోని లుధియానాలో( Ludhiana ) ఆదివారం నడిరోడ్డుపై ఓ షాకింగ్ ఘటన జరిగింది.

నడిరోడ్డుపై నరకం ఫోన్ లాక్కోబోయి మహిళను ఈడ్చుకుంటూ పోయాడు వీడియో వైరల్

రోజ్ గార్డెన్ సమీపంలో ఓ మహిళ తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, స్కూటర్‌పై వచ్చిన దుండగుడు ఆమె ఫోన్‌ను లాక్కోవడానికి( Phone Snatching ) ప్రయత్నించాడు.

నడిరోడ్డుపై నరకం ఫోన్ లాక్కోబోయి మహిళను ఈడ్చుకుంటూ పోయాడు వీడియో వైరల్

ఈ క్రమంలో ఆ మహిళను రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లాడు.ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బాధితురాలు ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తుంది.

పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఫోన్ రావడంతో మాట్లాడుకుంటూ నడుస్తోంది.ఇంతలో వెనుక నుంచి వేగంగా వచ్చిన దుండగుడు ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించాడు.

అయితే ఆ మహిళ ఫోన్‌ను గట్టిగా పట్టుకోవడంతో వదలలేదు.దీంతో ఆ దుండగుడు స్కూటర్‌ను( Scooter ) ఆపకుండానే ఆమెను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు.

కొంతదూరం వెళ్లేసరికి మహిళ కిందపడిపోయింది.దీంతో దుండగుడు ఫోన్‌తో అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. """/" / ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలించడం ప్రారంభించారు.

తాజాగా లుధియానా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.ఈ ఘటన జనవరి 27న జరిగిందని పోలీసులు తెలిపారు.

మహిళ ఫోన్‌లో మాట్లాడుతుండగా ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడని, ఆమె ప్రతిఘటించడంతో ఈడ్చుకెళ్లాడని పోలీసులు వెల్లడించారు.

"""/" / ఈ ఘటనతో లుధియానాలో ప్రజల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మొబైల్ ఫోన్ స్నాచింగ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఫోన్లు వాడుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

నిందితుడిని పట్టుకున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ధనుష్ తెలుగు హీరోగా మారిపోతున్నాడా..?

ధనుష్ తెలుగు హీరోగా మారిపోతున్నాడా..?