చిన్నప్పుడు తప్పిపోయిన కూతురు కోడలిగా మారింది... చివర్లో ట్విస్ట్ ఏంటంటే
TeluguStop.com
నిజ జీవితంలో కొన్ని సంఘటనలు ఏకంగా థ్రిల్లర్ మూవీ స్టొరీని తలపిస్తూ ఉంటాయి.
చాలా ట్విస్ట్ లు, సస్పెన్స్ తో నడుస్తాయి.విషయం రివీల్ అయ్యేంత వరకు వాస్తవాలు తెలియవు.
అమెరికాలో చిన్న వయస్సులోనే విడిపోయిన అన్నా చెల్లెళ్ళు తెలియకుండా ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు.
తరువాత వారిద్దరి డిఎన్ఏ ఆధారంగా ఒకే తల్లి పిల్లలు అనే విషయం బయటపడింది.
అలాగే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చిన్నప్పుడే విడిపోయే పెరిగి పెద్దయిన తర్వాత ఒకే కాలేజీలో చదువుతూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.
ఇద్దరూ ఒకే రూపంలో ఉండటంతో విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే వారిద్దరి తల్లి ఒకరే అని చిన్న వయస్సులో వేరొకరికి దత్తత ఇచ్చేయడంతో దూరమయ్యారని తెలిసింది.
ఇలాంటి ఘటన తాజాగా చైనాలో కూడా చోటు చేసుకుంది.చిన్న వయస్సులో తప్పిపోయిన కూతురు మళ్ళీ తల్లి ఇంటికి కోడలిగా వచ్చింది.
అయితే పెళ్లి పీటలు ఎక్కే సమయంలో విషయం రివీల్ అయ్యింది.చైనాలో సుజౌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ 20 ఏళ్ల కిందట కన్నబిడ్డను దూరం చేసుకుంది.
రోడ్డు పక్కన దొరికిన ఆ పాపను మరో దంపతులు పెంచి పెద్దచేశారు.ఇప్పుడా అమ్మాయి యుక్త వయసుకు రాగా, ఆ పెంచిన తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయించారు.
పెళ్లిరోజున ఆసక్తికర పరిణామం జరిగింది.తన కాబోయే కోడలి చేతిపై ఉన్న పుట్టుమచ్చను చూసి ఆ మహిళ ఎంతో ఆశ్చర్యానికి గురైంది.
చిన్నతనంలో తప్పిపోయిన తన కుమార్తె చేతిపైనా అలాంటి పుట్టుమచ్చే ఉంటుందన్న విషయం ఆమెకు గుర్తుకొచ్చింద.
దాంతో ఆ యువతి తల్లిదండ్రులను గట్టిగా ప్రశ్నిస్తే వాళ్లు నిజం చెప్పేశారు.చాన్నాళ్ల కిందట పాప దొరికితే పెంచుకున్నామని వెల్లడించారు.
తన అసలు తల్లి ఎవరో తెలిసిన ఆనందంలో ఉన్న ఆ యువతి.సోదరుడ్ని పెళ్లి చేసుకోవడం ఎలా అనే డైలమాలో పడింది.
అయితే ఆమె తల్లి ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చింది.ఆ యువకుడు తన కన్నబిడ్డ కాదని, తాను పెంచుకున్న అబ్బాయి అని తెలిపింది.
కుమార్తె దూరం కావడంతో ఆ అబ్బాయిని దత్తత చేసుకున్నానని వివరించింది.దాంతో వాళ్లిద్దరూ తోబుట్టువులు కాదని తేలిపోవడంతో పెళ్లి చేశారు.
భారతదేశంపై చైనీయుడు ఊహించని కామెంట్స్.. “ఇదో మిస్టరీ ప్లేస్” అంటూ..