ప్రేమ పెళ్లి, కట్నం కోసం వేధింపులు.. చివరికి ఏమైందంటే..?

ఇటీవలే కాలంలో యువత తమ మనసుకు నచ్చిన వారిని ప్రేమించి, ప్రేమ వివాహాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

ప్రేమ వివాహం చేసుకున్న వారిలో కొంతమంది సంసారం సాఫీగా సాగుతుంటే.మరికొందరి జీవితం వేధింపులకు గురి అవుతుంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వరకట్నం( Dowry ) కోసం భర్తతో పాటు అత్తమామలు చిత్రహింసలకు గురి చేశారు.

వరకట్నం అనే భూతం ఆ యువతి ప్రాణాలను బలి తీసుకుంది.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

వివరాల్లోకెళితే.వనపర్తి జిల్లా( Wanaparthy ) ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన వడ్ల భరత్, శివకావ్య (26) ప్రేమించుకుని ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.

వీరిది కులాంతర వివాహం.వివాహం తర్వాత మూడు నెలల వరకు శివకావ్యను( Shivakavya ) భర్త బాగానే చూసుకున్నాడు.

అయితే శివ కావ్య మూడు నెలల గర్భవతి అయిన తరువాత భరత్ తో ( Bharath ) పాటు కుటుంబ సభ్యులు వరకట్నం కోసం శివకావ్యను వేధించడం మొదలుపెట్టారు.

"""/" / శివ కావ్య ఒక బాబుకు జన్మనిచ్చింది.ఆ తర్వాత శివకావ్య గర్భం దాల్చితే బలవంతంగా అబార్షన్( Abortion ) మాత్రలు వేయించడం, వరకట్నం తెచ్చాకే పిల్లలు కనకుడాదు అని కండిషన్ పెట్టడంతో శివ కావ్య ఈ విషయం తల్లిదండ్రుల దృష్టికి తీసుకువచ్చింది.

ఎన్నోసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటివి కూడా చేసింది.పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి భరత్ ను మందలించి కాపురానికి పంపించారు.

"""/" / అయితే శివ కావ్య మానసిక వేదనకు గురి కావడంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.

హైదరాబాద్ లోని పలు హాస్పిటల్స్ లలో వైద్యం కూడా అందించారు.హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న కావ్యను మానసికంగా వేధించడంతోపాటు ఆమె తల్లిపై కూడా భరత్ దాడి చేయడంతో మరింత ఆందోళనలకు గురైన కావ్య హార్ట్ బీట్ పెరిగి గురువారం రాత్రి మృతి చెందింది.

శివ కావ్య తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భరత్తోపాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేందర్ మీడియాకు తెలిపారు.

వావ్, చెత్త నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ తయారుచేసిన యువకుడు…