ఆర్మీ జవాన్ ఇంట్లో వ్యభిచారం... డ్యాన్సర్ అరెస్ట్...

దేశంలో వ్యభిచార గృహాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినప్పటికీ వ్యభిచార గృహ నిర్వాహకులు మాత్రం ఎక్కడో ఓ చోట వ్యభిచార గృహాలు నిర్వహిస్తూనే ఉన్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్లో లోని మీరట్ నగరంలో ఏకంగా  ఆర్మీ జవానుగా పని చేసినటువంటి ఓ వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకొని అందులోనే వ్యభిచారం నిర్వహిస్తున్న టువంటి ముఠాని పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతంలోని ఓ వ్యక్తి  ఆర్మీలో బీఎస్ఎఫ్ జవాన్లు గా పని చేస్తున్నాడు.

అతడు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో నివసిస్తున్నాడు.దాంతో అతడు తన ఇంటిని డాన్సర్ గా పని చేస్తున్నటువంటి ఓ మహిళకి అద్దెకి ఇచ్చాడు.

దీంతో ఆమె గుట్టుచప్పుడు కాకుండా ఆ ఇంట్లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది.సోషల్ మీడియా ద్వారా విటులకి అందమైన యువతుల ఫోటోలు పంపించి వారికి యువతులను సరఫరా చేసేది.

ఇందుకుగానూ ఆమె గంటకి మూడు వేల రూపాయల నుంచి ఐదువేల రూపాయలు వసూలు చేసేది.

అయితే రోజూ వేళ్ళు ఉంటున్న ఇంటికి పలువురు వ్యక్తులు వచ్చిపోతూ ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

"""/"/ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారు ఉంటున్న నివాసంపై రైడ్ చేశారు.

ఈ రైడ్లో భాగంగా వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి మహిళలు మరియు విటులను అరెస్టు చేశారు.

ఈ వ్యభిచారం చేసేటువంటి యువతులలో ఇద్దరూ మైనర్ బాలికలు కూడా ఉన్నారు.దీంతో ఈ మైనర్ బాలికలను  పునరావాస కేంద్రానికి పంపించి మిగిలిన వారిని విచారణ నిమిత్తమై రిమాండ్ కి తరలించారు.

అంతేగాక ఈ వ్యభిచార గృహ నిర్వహణ లో ఆర్మీ జవాను పాత్ర ఏమైనా ఉందా.

? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. .

రియల్ లైఫ్ లో నాన్నకు ముఫాసాతో పోలికలు.. సితార ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!