వీడియో వైరల్: అప్పడం, గుడ్డు.. ఇప్పుడు చేప.. భానుడి దెబ్బకి విలవిలాడుతున్న ప్రజలు..
TeluguStop.com
ప్రస్తుతం చాలా చోట్ల వర్షాలు పడుతున్న గాని ఎండ తీవ్రత మాత్రం తగ్గడం లేదు.
దేశంలో పలు ప్రాంతాలలో తీవ్రమైన ఎండ వేడిగాలుల( Heat Waves ) కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దక్షిణ భారతదేశంలో కాకుండా ఉత్తర భారత దేశంలో కూడా ప్రస్తుతం 45 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు రావడంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోతున్నారు.
ముఖ్యంగా ఆడవారు పిల్లలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.ఈ నేపధ్యంలో ఎండ తీవ్రతకు సంబంధించిన అనేక వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడం చూస్తూనే ఉంటాము.
ఇందులో భాగంగానే తాజాగా ఓ భారతీయ జవాన్ ఎండ తీవ్రతకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం మనం చూసాం.
"""/" /
ఎడారిలో ఇసుకతో పాపడ్( Papad ) కాల్చడం, అలాగే మరో వీడియోలో గుడ్డుని( Egg ) ఉడికించడం లాంటి వీడియోలను ఇదివరకు చూసాం.
తాజాగా అలాంటి సీన్ మరొకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.ఆ వీడియోలో ఒక అమ్మాయి సూర్యుడి ప్రతాపంతో ఓ పెన్నంలో నూనెను తీసుకొని బయట ఉంచగా ఆ నూనె మొత్తం వేడిగా అయిపోతుంది.
అలా బాగా ఎండలో వేడెక్కిన నూనెలో ఓ చేపను( Fish ) తీసుకువచ్చి అందులో వస్తుంది.
"""/" /
అంతే ఆ చేప పడుతూనే నూనె భగభగ మండుతూ చేపలు ఫ్రై చేసేస్తోంది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.ఓ అమ్మాయి రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రాయిపై నూనెతో కూడా ఫ్రైయింగ్ పాన్ పెట్టగా ఎండతో నూనె వేడెక్కిన తర్వాత అందులో మసాలా పెట్టి ఉంచిన చేపని పెట్టి అందులో వేస్తుంది.
అంతే అక్కడ ఎలాంటి స్టౌ లేకుండానే వేడి నూనెతోనే చేప దానికదే ఫ్రై అయిపోతుంది.
ఆ వీడియోలో కనిపించిన అమ్మాయి పేరు ఉర్మి.( Urmi ) ఆ అమ్మాయి బెంగాల్ కు చెందిన అమ్మాయిగా తెలుస్తోంది.
ఇక ఈ వీడియోకి 6 మిలియన్ల పైన వ్యూస్ వచ్చాయి.అలాగే లక్షల సంఖ్యలో లైక్స్ కూడా వచ్చాయి.
ఇక ఈ ఎండ తీవ్రతను సంబంధించిన వీడియో చూసి నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
వార్ 2 లో ఎన్టీయార్ ఎంత సేపు కనిపిస్తాడు..?