ఘోర విషాదం ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) బోయినిపల్లి మండలం కొదురుపాక వద్ద శ్రీ రాజరాజేశ్వర మద్య మానేరు జలాశయంలో ముగ్గురు పిల్లలతో సహా తల్లి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
కుమారుడు అయాన్ (7), కూతురు అశ్రజబిన్ (5) పసికందు ఉస్మాన్ (14 నెలలు) తల్లి రజిత (30) మృతి చెందారు.
వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.దాదాపుగా 9 సంవత్సరాల క్రితం మహమ్మద్ ఆలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఆత్మహత్యకు కారణాలు వివరాలు తెలియాల్సి ఉంది.సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సిఐ వెంకటేష్, బోయినిపల్లి ఎస్సై మహేందర్ తెలిపారు.
మంచు విష్ణు ప్రభాస్ మీద కామెంట్స్ చేయడం వల్ల కన్నప్ప సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా..?