అప్పుల బాధ తాళలేక మహిళా ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా: అప్పుల బాధ తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో విషాదం నింపింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.సిరిపురం గ్రామానికి చెందిన దోర్నాల విజయలక్ష్మి తమ కుల వృత్తి చేనేత పని చేసుకొని జీవనం సాగిస్తోంది.

ఈ మధ్యకాలంలో కుటుంబ భారం పెరిగి,ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువై,అప్పుల బాధ తాళలేక గురువారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చేనేత పనిలో వాడే నైట్రైటేను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఇంట్లో స్పృహ తప్పి పడిపోయి ఉండగా తన కోడలు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రామన్నపేట ఆసుపత్రికి తరలించగా,పరిస్థితి విషమంగా ఉండడంతో కామినేని హాస్పిటల్ కు తరలించారు.

అప్పటికే మరణించినట్లు అక్కడి డ్యూటి డాక్టర్ నిర్దారించడంతో పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కొడుకు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామన్నపేట ఎస్‌ఐ పి.

మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

ఆ పాట విని రాత్రి రెండు గంటలకు డ్యాన్స్ చేశా…. వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!