రెండు వారాల్లో 27 లక్షలు వసూలు చేసిన యువతులు..కానీ చివరకు..!

మాయగాళ్లు.రోజురోజుకూ మోసాలు చేస్తూ వచ్చిన సొమ్ముతో విలాసవంతంగా గడుపుతూ ఉంటారు.

పోలీసులు ఎంత అరికడుతున్న రోజురోజుకూ నేరాలు పెరిగి పోతున్నాయి.ఈ మధ్య యువతులు కూడా మోసాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచేస్తున్నారు.

ప్రెసెంట్ ఇద్దరు యువతులు చేసిన మోసం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27 లక్షల రూపాయలను ఆ వ్యక్తి దగ్గర తెలివిగా తీసుకున్నారు.

నిరక్షరాస్యులైతే పోనీ వారికి తెలియక మోస పోయారేమో అని అనుకోవచ్చు.కానీ బాగా చదువుకుని ఉన్నత స్థానాలలో ఉన్న వారు కూడా మోసపోతూనే ఉన్నారు.

ఇలాంటి ఘటనలు ఎన్ని వెలుగులోకి వచ్చిన కూడా మోసపోయే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

తాజాగా ఇద్దరు యువతులు స్నేహం పేరుతొ నమ్మించి అందిన కాడికి దోచేశారు.అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.వైజాగ్ అచ్యుతాపురం సెజ్ లో పని చేస్తున్న రవి ప్రసాద్ గుప్తా అనే యువకుడికి కార్ల మోర్గాన్ అనే పేరుతొ పేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడంతో అతడు యాక్సెప్ట్ చేసాడు.

ఆ తర్వాత చాట్ చేసుకోవడం మొదలు పెట్టారు.ఆ చాట్ తో మరింత చనువు పెరిగి ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చుకుని కాల్స్ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

ఈ క్రమంలో మనిద్దరం కలుద్దాం అని అందంతి గుత్తా సంతోషంగా సరే అన్నాడు.

ఆ తర్వాత ఫ్లయిట్ టికెట్ పోస్ట్ చేసి డబ్బులు తక్కువ అయ్యాయని 60 వేలు పంపించామని అడిగింది.

దీంతో అతడు వెంటనే పంపించాడు.ఆ తర్వాత మరొక యువతి కాల్ చేసి కార్ల ఇమ్మిగ్రేషన్ కోసం మరింత డబ్బు చెల్లించాలని అప్పటి నుండి రెండు వారాల వరకు దడపా 27 లక్షలు వసూలు చేసారు.

ఆ తర్వాత ఆ ఇద్దరి ఫోన్ నెంబర్లు కలవడం లేదని అతడు మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగిన మన ప్రజలలో మార్పు అయితే రావడం లేదు.

పోలీసులు కూడా కొంచెం ఆలోచించుకుని డబ్బు పంపాలని చెబుతున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌.. ఇది ముంబై సిటీ కంటే పెద్దది..