ఛీ.. ఛీ.. హాలోవీన్ వేడుకల్లో చేతివాటం చూపించిన మహిళ

ప్రస్తుత రోజులలో ఎక్కడా చూసిన దొంగతనాలు దారి దోపిడీలు జరగడం లాంటివి ఎక్కువగా అయిపోయాయి.

రోడ్లపై, ఇంటి లోపల దుండగులు ప్రవేశించి వారికి ఇష్టం వచ్చినట్లు వారు దోచేసుకుంటూ ఉన్నారు.

అయితే తాజాగా ఒక మహిళ ‘హాలోవీన్ డే’( Halloween Day ) సెలబ్రేషన్లలో భాగంగా ఇంటి ముందు ఉండే క్యాండస్, గిఫ్ట్ బాక్స్, చాక్లెట్లు పలు రకాల వస్తువులను దొంగలిస్తూ కెమెరా కంటపడింది.

సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే. """/" / మన భారతదేశం మొత్తం దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటే.

పాశ్చాత్య దేశాలు ‘హాలోవీన్ డే’ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు.ఈ ‘హాలోవీన్ డే’ వేడుకలలో భాగంగా కెనడాలో( Canada ) ఒక మహిళా పలు ఇళ్ళ ముందు పిల్లల కోసం పెట్టిన చాక్లెట్లు, గిఫ్ట్ బాక్స్ లు, లైట్స్, క్యాండీస్ ఇలా పలు రకాల వస్తువులను దొంగలిస్తూ( Steal ) కెమెరాకు చిక్కింది.

ఇలా ఆ మహిళ దొంగలించిన వస్తువులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

"""/" / ఆ మహిళ సల్వార్ కమీజ్ ధరించి, ఒంటారియోలోని( Ontario ) మార్ఖమ్‌ కార్నెల్ ప్రాంతంలో ప్రతి ఇంటి ఇంటి వద్దకు వెళ్లి ఆమె తెచ్చుకున్న సంచిలో ఆమెకు తోచింది తోచినట్టు అన్ని దోచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఛీ.ఇదేం పాడు బుద్ధి అని కొందరు కామెంట్ చేస్తూ ఉంటే.

మరి కొందరు ఇలాంటివారు విదేశాలలో మన ఇండియన్స్ పరువు తీసేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

డాకు మహారాజ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. బాలయ్య ఫ్యాన్స్ కు ఆరోజే పండగంటూ?