ప్రమాదకరమైన చేపను పట్టుకున్న యువతి .. అది సైనైడ్ కంటే భయంకరమైనది తెలుసా?

అది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ బీచ్‌.( Melbourne Beach ) అక్కడ ఇసుక తిన్నెలపైన తన పెంపుడు కుక్కతో ఒక యువతి సరదాగా షికారు చేస్తోంది.

సరిగ్గా అదే సమయంలో ఆ కుక్క బీచ్ లో కనబడిన ఒక జీవిని తినడానికి ప్రయత్నించింది.

అది చనిపోయిన చేపలాగా వుంది.ఆ విషయాన్ని గమనించిన ఆ యువతి ఈ జీవిని గుర్తు పట్టి, వెంటనే ఆ కుక్కనుంది దానిని లాక్కుంది.

ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన చేప( Poisonous Fish ) జాతులలో ఇది కూడా ఒకటి అని ఆ యువతి అంటోంది.

అవును, అది ప్రమాదకరమైన పఫర్ ఫిష్‌.కాగా ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా పేజీ రెడ్డిట్‌లో పోస్ట్ చేసింది.

"""/" / పోస్టు చేస్తూ ఆమె."నోట కరచుకున్న చేపని వదలడానికి నా కుక్క ససేమిరా అంది.

కానీ దానికి తెలియదు! అది ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటోందని.అప్పుడు దానిని కుక్క నోటి నుండి గట్టిగా లాక్కోవలసి వచ్చింది.

ఇలా చేస్తున్న సమయంలో నా బొటనవేలుపై చిన్న ముళ్లు కూడా గుచ్చుకుంది.మరి ఇప్పుడు మాకు ఏం కాదు కదా?" అంటూ ప్రశ్నించింది.

ఇకపోతే ఈ పఫర్ ఫిష్‌ లో( Puffer Fish ) 30 మందిని పైగా చంపడానికి తగినంత విషం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

అంతేకాకుండా పఫర్ ఫిష్ చనిపోయిన లేదా సజీవంగా ఉన్నా కూడా ప్రాణాంతకమే అని చెబుతున్నారు.

"""/" / ఇకపోతే ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన జీవుల్లో పఫర్ ఫిష్ ఒకటి.

దీని చర్మంపై, అంతర్గత అవయవాల్లో "టెట్రోడోటాక్సిన్" అనే టాక్సిన్‌ను ఉంటుంది.ఇలాంటిది నీలిరంగు ఆక్టోపస్‌లో కూడా మనకు కనిపిస్తుంది.

యానిమల్ ఎమర్జెన్సీ సర్వీస్ ప్రకారం.ఇది సైనైడ్ కంటే 1200 రెట్లు ఎక్కువ విషపూరితమైనదని సమాచారం.

స్మాల్ యానిమల్ స్పెషలిస్ట్ హాస్పిటల్‌లోని న్యూరాలజీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ జార్జినా చైల్డ్ ఈ టాక్సిన్ “నిమిషాల్లో” జంతువులను చంపేస్తుందని హెచ్చరించింది.

కొండాపూర్‎లో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల విక్రయ ముఠా అరెస్ట్..!