అక్రమ సంబంధంతో మహిళ దారుణ హత్య !

భార్య పుట్టింటికి వెళ్లడంతో ఓ వ్యక్తి తన ప్రియురాలిని ఇంటికి రప్పించుకున్నాడు.ఏమైందో తెలియదు.

వారిద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది.కోపోధ్రిక్తుడైన ఆ వ్యక్తి ఆ మహిళ తలపై కర్రతో గట్టిగా కొట్టాడు.

అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.అక్రమ సంబంధం పెట్టుకుని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

చిలకానగర్ లో అంజయ్య అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు.అయితే అతడికి రేణుక అనే మహిళతో కొన్నేళ్లుగా అక్రమ సంబంధం నడుస్తోంది.

ఈ క్రమంలో ఆదివారం అంజయ్య భార్య పుట్టింటికి వెళ్లింది.దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న అంజయ్య తన ప్రియురాలిని ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పాడు.

దీంతో ఆ మహిళ ఇంటికి రాత్రి వచ్చింది.ఇద్దరు మాట్లాడుతుండగా.

ఏం జరిగిందో తెలియదు అంజయ్య, రేణుక మధ్య గొడవ నెలకొంది.వాగ్వాదం పెరుగుతూ వచ్చింది.

దీంతో కోపోధ్రిక్తుడైన అంజయ్య పక్కనే ఉన్న కర్రను చేత పట్టి రేణుక తలపై గట్టిగా కొట్టాడు.

దీంతో రేణుక తీవ్ర రక్తస్రావం ఏర్పడి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది.అనంతరం అంజయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.ఆధారాలు సేకరించిన హత్యకు కారణాలు తెలియడం లేదని పోలీసులు తెలిపారు.

పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ వేడుకకు వస్తే సినిమా ఫ్లాపేనా… ఇదేం లాజిక్?