డబ్బు కోసం వేధిస్తున్నాడని కన్నకొడుకుని దారుణంగా ….
TeluguStop.com
ప్రస్తుత కాలంలో కొందరు మద్యానికి బానిసలై చేసేటటువంటి పనుల కారణంగా ఇతరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజాగా ఓ మహిళ తన కొడుకు నిత్యం మద్యం సేవిస్తూ డబ్బు కోసం వేధిస్తుండటంతో తన కన్న కొడుకని కూడా చూడకుండా మద్యం మత్తులో ఉన్నటువంటి అతడిపై కిరోసిన్ పోసి తగలబెట్టి దారుణంగా హత్య చేసినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని వరంగల్ పట్టణ పరిసర ప్రాంతంలో రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.
ఐతే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై పట్టణంలో చిన్న చిన్న పనులు చేస్తుండేవాడు.
ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. దీంతో భర్త చేసేటటువంటి ఆకృత్యాలను భరించలేక అతడి భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
దాంతో అప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ తన తల్లి దగ్గరే నివాసం ఉంటున్నాడు.
అయితే ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎలాంటి పనులు లేకపోవడంతో ఇంటి పట్టునే ఉంటున్నాడు.
దీంతో తరచూ తన తల్లిని మద్యం సేవించడానికి డబ్బు కోసం వేధిస్తుండేడు.దీంతో ఆమె ప్రస్తుతం ఎలాంటి పనులు లేకపోవడం వల్ల తన దగ్గర డబ్బు లేదని అంతేకాక ఉన్నటువంటి డబ్బుని మద్యం సేవించడానికి ఖర్చుచేస్తే కుటుంబం గడవడం కష్టమవుతుందని పలుమార్లు చెప్పినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ వినకుండా గొడవ చేసేవాడు.
ఈ క్రమంలో మరోమారు ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె తనకు పుట్టిన కొడుకని కూడా చూడకుండా రాజేంద్ర ప్రసాద్ నిద్రిస్తున్న సమయంలో కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది.
ఇది గమనించిన స్థానికులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించినప్పటికీ అప్పటికే రాజేంద్ర ప్రసాద్ తీవ్ర గాయాలయి మరణించాడు.
దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి నిందితురాలిని అరెస్ట్ చేసి రిమైండర్ కి తరలించారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్2, సోమవారం 2024