సిద్దిపేటలో మహిళ దారుణ హత్య.. శరీర భాగాలను ముక్కలుగా నరికి..!

ఇటీవలే కాలంలో సమాజంలో ఒంటరిగా జీవిస్తున్న మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన, ఎంత కఠినంగా శిక్షించిన సమాజంలో మార్పు అనేది రాకుండా రోజురోజుకు దారుణాలు పెరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య గురైన ఘటన సిద్దిపేట జిల్లాలో( Siddipeta ) చోటుచేసుకుంది.

ఈ హత్యతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

గజ్వేల్ ఏసీపీ రమేష్( Gajwel ACP Ramesh ) తెలిపిన వివరాల ప్రకారం.

సిద్దిపేటలోని ములుగు మండలం బండమైలారం గ్రామంలో వెంకటమ్మ (40)( Venkatamma ) అనే మహిళ నివసిస్తోంది.

ఈమెకు ముగ్గురు పిల్లలు సంతానం.ఈమె భర్త కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు.

వెంకటమ్మ ప్లాస్టిక్ వంటి సామాగ్రి అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తుంది. """/" / తాజాగా గురువారం వెంకటమ్మ ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు ఆమె గొంతు కోసి, శరీర భాగాలను, కాళ్ళను వేరు చేశారు.

అనంతరం అక్కడి నుండి పరారయ్యారు.పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వెంకటమ్మ గా గుర్తించారు.

"""/" / పోలీసులు డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీమ్ సహాయంతో సాక్షాలను సేకరించేందుకు చర్యలు చేపట్టారు.

వెంకటమ్మను ఎవరు హత్య చేశారు.? వెంకటమ్మను హత్య చేయడానికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

పోస్టుమార్టం( Postmortem ) నిమిత్తం వెంకటమ్మ మృతదేహాన్ని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.వెంకటమ్మ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ హత్య ఘటనతో బండమైలారం గ్రామంలో( Bandamylaram Village ) విషాద ఛాయలు అలుముకున్నాయి.

త్వరలోనే హత్యకు గల కారణాలు ఏమిటో బయటకు వస్తాయని గజ్వేల్ ఎసీపీ రమేష్ తెలిపారు.