పోలీసు ఉద్యోగాలకు నిర్వహించే ఈవెంట్స్‌లో యువతి మాస్టర్‌ప్లాన్.. విగ్గు పెట్టుకొచ్చింది

చాలా మందికి పోలీసు ఉద్యోగం సాధించాలనే ఆకాంక్ష ఉంటుంది.అందుకోసం వారు చాలా కష్టపడుతుంటారు.

ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తుందా అని ఎదురు చూస్తుంటారు.ఉద్యోగ నియామక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం కోసం చాలా శ్రమిస్తారు.

అయితే కొన్ని విషయాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసే అభ్యర్థులకు ప్రతికూలతలు ఉంటాయి.

ఎత్తు, బరువు వంటి వాటి విషయంలో నిర్ధేశించిన ప్రమాణాలు లేకుంటే ఉద్యోగానికి ముందుగానే అనర్హతకు గురవుతారు.

అయితే ఈ విషయంలో ఓ యువతి అద్భుతమైన ప్లాన్ వేసింది.తాను పొట్టిగా ఉండడంతో తన ఎత్తును కృత్రిమంగా పెంచేసింది.

విగ్గు పెట్టుకుని వచ్చి పోలీసులను బురిడీ కొట్టించాలనుకుంది.అయితే అడ్డంగా దొరికి పోయింది.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామకానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.

ఇందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శారీరక ధారుఢ్య పరీక్షలను అధికారులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ఓ యువతి తాను పొట్టిగా ఉన్నానని తెలుసుకుంది.నిర్ణీత ఎత్తు తాను లేననే విషయం గ్రహించింది.

పోలీసు ఉద్యోగానికి నిర్వహించే శారీరక ధారుఢ్య పరీక్షలకు వెళ్తే తాను ఫెయిల్ అవుతానని ఆమెకు ముందుగానే తెలుసు.

దీంతో ఆమె మాస్టర్ ప్లాన్ వేసింది. """/"/ తలపై మైనపు సీల్‌తో కూడిన విగ్గు ధరించింది.

దీంతో ఆమె ఎప్పటిలాగా కంటే కాస్త ఎక్కువగా కనిపించింది.అయితే ఎత్తు కొలిచే మెషీన్ వద్ద ఆమె నిల్చున్నప్పుడు ఎలక్ట్రానిక్ పరికరంలోని సెన్సార్‌లు స్పందించలేదు.

దీంతో అధికారులు అయోమయంలో పడ్డారు.మెషీన్‌లో ఏదైనా లోపం ఉందేమోనని భావించారు.

అయితే మెషీన్ బాగానే ఉంది.దీంతో అనుమానంతో యువతి జుట్టును పరిశీలించారు.

అప్పుడు వారికి విషయం అర్ధం అయింది.ఆమె జుట్టుపై M-సీల్ మైనపు ముక్కను అతికించి తన ఎత్తును పెంచుకోవడానికి ప్రయత్నించింది.

దీంతో ఆమెపై అధికారులు అనర్హత వేటు వేశారు.

రజినీకాంత్ జైలర్ 2 లో విలన్ గా చేస్తున్న తెలుగు స్టార్ హీరో…ఇక ఆయన జాతకం మారినట్టేనా..