ఇదో వెరైటీ మర్డర్.. ప్రియుడికి ముద్దిచ్చి చంపేసిన మహిళ

కొన్నిసార్లు వింత విషయాలను మనం వింటూ ఉంటాం.అవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి.

అలాంటివి అసలు నమ్మశక్యంగా కూడా ఉండవు.తాజాగా అలాంటి ఒక ఘటన చోటుచేసుకుంది.

కొంతమంది స్మార్ట్ గా దొంగతనాలు, హత్యలు చేస్తూ ఉంటారు.ఇతరులకు తెలియకుండా ఉండేందుకు వినూత్న ఆలోచనలు చేస్తూ ఉంటారు.

పోలీసుల కంట పడకుండా ఉండేందుకు నినూత్న ఆలోచనలు చేస్తూ ఉంటారు.ఇప్పుడు ఓ మహిళ కూడా ఓ మర్డర్ చేసేందుకు నయా స్కెచ్ వేసింది.

అయితే చివరికి పోలీసులకు అడ్డంగా దొరికింది.జైల్లో శిక్ష అనుభవిస్తున్న తాను ప్రేమించిన ప్రియుడిని ప్రియురాలు చంపేసింది.

చంపేముందు అతడికి లిప్ కిస్ ఇవ్వడం గమనార్హం.అయితే ఆ లిప్ కిస్ లోనే అసలు సీక్రెట్ ఉంది.

ఆమె లిప్ కిస్ వల్లే ప్రియుడు చనిపోయాడు.ఈ ఘటన అమెరికాలోని టేనస్సీలో చోటుచేసుకుంది.

డ్రగ్స్ కేసులో జాషూ బ్రౌన్ అనే వ్యక్తి టేనస్సీ జైలులో 11 ఏళ్లు జైలుశిక్ష అనుభవిస్తున్నాడు.

ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన అతడి ప్రియురాలు రాచెల్ డాలార్డ్ అనే యువతి కలిసేందుకు వచ్చింది.

"""/"/కలిసిన తర్వాత పోతూ ప్రియుడికి లిప్ కిస్ ఇచ్చింది.లిప్ కిస్ పెట్టి ఏమీ తెలియనట్లు వెళ్లిపోయింది.

అయితే ఆమె వెళ్లిపోయిన కొద్దిసేపటికి ప్రియుడు చనిపోయాడు.దీంతో పోలీసులు ఆశ్చర్యపోయిన సీసీ ఫుటేజీ పరిశీలించగా అసలు విషయం బయటపడింది.

ఆమె లిపక్ కిస్ పెట్టినప్పుడు ఆమె నోటి నుంచి 0.5 ఔన్స్ మెఠాంఫెటామైన్ అనే డ్రగ్ అతడి నోట్లోకి పోయింది.

అతడు బాత్రూమ్ లోకి వెళ్లి దానిని బయటకు తీసుకోవాలని అనుకున్నాడు.కానీ ఓవర్ డోస్ కావడంతో చనిపోయాడు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నాడు.ఆమె ఎందుకు ప్రియుడిని చంపేసిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

పార్లమెంట్‌లో తప్పుడు సాక్ష్యం .. సింగపూర్‌లో దోషిగా తేలిన భారత సంతతి నేత