పతుల విజయం కోసం సతుల తిప్పలు
TeluguStop.com
నల్లగొండ జిల్లా: ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులకే కాదు వారి సతీమణులకు ఈ ఎన్నిక అసలుసిసలు సవాలుగానే మారిందా అని నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పతుల కోసం సతులు పడుతున్న తిప్పలను చూస్తే అనిపిస్తుంది.
ఇప్పటికే పతులు ప్రచార ఘట్టంలో నువ్వానేనా అంటూ దూసుకెళ్తుండగా,తాము కూడా తగ్గేదేలే.అన్నట్లుగా సతులు ఎన్నికల ప్రచార సంగ్రామంలో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు జైవీర్ రెడ్డి సతీమణి అనుశ్రీ తనదైన శైలిలో దూసుకుపోతుంటే, బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ సతీమణి భవాని కూడా తన పతి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తోంది.
ఇద్దరు సతులు నియోజకవర్గ వ్యాప్తంగా గడపగడపకు తిరుగుతూ బొట్టు పెడుతూ,పిల్లల్ని పలకరిస్తూ,మంచి చెడులను విచారిస్తూ మా పతికే ఓటేయాలని ఓటర్లను తమవైపునకు తిప్పుకొనేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒకరు ప్రభుత్వ పథకాలు, అభివృద్ది మంత్రం జపిస్తూ ప్రచారం చేస్తుంటే, మరొకరు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పథకాల్లో అక్రమాలు, నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ది, స్థానికత, ఆరు గ్యారెంటీలను ప్రచారం చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు.
ఇద్దరు అభ్యర్ధుల సతులు పతుల గెలుపు కోసం నానా తిప్పలు పడుతున్న తీరు చూసి నియోజకవర్గ ఓటర్లు ఎమ్మేల్యే అభ్యర్దులు పతులా సతులా అనుకుంటున్నారు.
అక్కడికి వెళ్లడానికి నేను ఏమాత్రం సిగ్గుపడను… పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు!