ఈ డివైజ్‌తో మామూలు సైకిల్‌ను ఎలక్ట్రిక్ సైకిల్‌గా మార్చేయొచ్చు.. అదెలాగంటే!

సైకిల్‌పై ప్రయాణం ఎంతో ఉత్సాహభరితంగా ఉంటుంది.సైకిల్ తొక్కుతూ ప్రదేశాలు తిరుగుతూ ఉంటే వచ్చే ఆనందమే వేరు.

అయితే ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ సైకిల్స్ కి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది.వీటిని కొనుగోలు చేస్తే చాలా తక్కువ ధరతో సిటీలో హాయిగా తిరుగొచ్చు.

అలసిపోకుండా రోజూ 10-20 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.అలాగే పర్యావరణానికి ఎంతో మేలు చేకూర్చొచ్చు.

అయితే ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా ఎక్కువ ధర ఉంటున్నాయి.దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలు వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారు.

అయితే సాధారణ సైకిల్‌ను చాలా తక్కువ ధరతో ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చే పికాబూస్ట్‌ అనే కిట్‌ను ఒక అమెరికన్ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

ఈ కిట్‌ను సాధారణ సైకిలు సీటు కింద గిర్రకు ఆనుకునేలా బిగించాలి.అంతే ఇక మీ సైకిల్ ఎలక్ట్రిక్ సైకిల్ గా మారిపోతుంది.

ఈ కిట్‌కు ఒక చక్రం ఉంటుంది.ఆ చక్రం సైకిల్ గిర్రను పట్టుకొని దానిని తిప్పుతుంది.

దీనివల్ల సైకిల్ పెడల్ తొక్కాల్సిన అవసరం ఉండదు.పికాబూస్ట్‌ కిట్‌లో 234 వాట్ల బ్యాటరీ ఉంటుంది.

ఇది ఇండియాలో కూడా లాంచ్ అవుతే దాని ధర తక్కువగానే నిర్ణయించే అవకాశం ఉంటుంది.

దీనివల్ల దీనిని ఎక్కువ మంది కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. """/"/ పికాబూస్ట్‌ కిట్‌ 3 గంటల వ్యవధిలో ఫుల్ ఛార్జ్ అవుతుంది.

దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయవచ్చు.బ్రేక్‌ వేసినప్పుడు, రోడ్డు వాలుగా ఉన్నప్పుడు ఈ కిట్‌ ఛార్జింగ్ ను సేవ్ చేస్తుంది.

దీన్ని సహాయంతో ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించాలనుకుంటే అప్పుడప్పుడు పెడల్ తొక్కుతూ ఉండొచ్చు.

ఈ కిట్‌ జస్ట్ 3 కిలోల బరువే మాత్రమే ఉంటుంది కాబట్టి దీన్ని ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.

యూఎస్‌బీ పోర్టు ఇందులో ఉంటుంది కాబట్టి స్మార్ట్‌ఫోన్‌లతో కూడా దీనిని ఛార్జ్‌ చేసుకోవచ్చు.

వర్షం, మంచు, ఎండ అన్ని వాతావరణ పరిస్థితులలో ఇది తట్టుకుంటుంది.

ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుల అందరి చూపు ప్రభాస్ వైపే.. దెబ్బకు ప్యాన్ ఇండియా డైరెక్టర్స్ !