ఈ రెండు చిట్కాలతో అరగంటలో ఫేషియల్ గ్లో పొందొచ్చు.. తెలుసా?

సాధారణంగా ఏదైనా పెళ్లి లేదా ఫంక్షన్ ఉంది అంటే మగువలు బ్యూటీ పార్లర్ కు పరుగులు పెట్టడం అనేది చాలా కామన్.

అయితే కొందరికి ఫేషియల్ చేయించుకునే వెసులుబాటు ఉండకపోవచ్చు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే రెండు ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా తోడ్పడతాయి.

ఈ చిట్కాలతో కేవలం అరగంటలోనే ఫేషియల్ గ్లో పొందవచ్చు.పైగా ఖ‌ర్చును కూడా బోలెడంత త‌గ్గించుకోవ‌చ్చు.

మరి ఇంతకీ ఆ రెండు చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి. """/" / ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon Juice )మరియు రెండు టేబుల్ స్పూన్లు పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై తడి క్లాత్ తో శుభ్రంగా ఫేస్ ను క్లీన్ చేసుకోవాలి. """/" / ఆ వెంటనే మరొక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder ), వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, చిటికెడు ఆర్గానిక్ పసుపు మరియు సరిపడా గ్రీన్ టీ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మ‌రియు మెడకు అప్లై చేసుకుని ప‌ది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం తడి వేళ్ళతో సున్నితంగా చర్మాన్ని స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ రెండు సింపుల్ చిట్కాలు పాటించడం ద్వారా చర్మం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృతకణాలు తొలగిపోతాయి.

చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.స్కిన్ హైడ్రేట్ అవుతుంది.

రక్త ప్రసరణ పెరుగుతుంది.చర్మ కణాలు ఆరోగ్యంగా మార‌తాయి.

స్కిన్ సూపర్ వైట్ గా మరియు బ్రైట్ గా మారుతుంది.ఫేషియల్ గ్లో మీ సొంతం అవుతుంది.

కూతురిని ఎప్పుడు చూపిస్తావ్ చరణ్.. మెగా ఫ్యాన్స్ ప్రశ్నలకు జవాబు దొరుకుతుందా?