ఈ రెండు ఉంటే చాలు.. చుండ్రు సమస్యకు సులభంగా బై బై చెప్పవచ్చు!
TeluguStop.com
చుండ్రు.కోట్లాది మందిని పట్టిపీడించే అత్యంత సర్వసాధారణమైన సమస్య ఇది.
స్త్రీలే కాదు పురుషులు కూడా చుండ్రు సమస్యతో తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.చుండ్రును వదిలించుకోవడం కోసం ముప్పతిప్పలు పడుతుంటారు.
అందులోనూ ప్రస్తుత చలికాలంలో చుండ్రు సమస్య మరింత అధికంగా వేధిస్తూ ఉంటుంది.అయితే ఇకపై చుండ్రుతో అస్సలు వర్రీ వద్దు.
ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాతో చుండ్రు సమస్యకు సులభంగా బై బై చెప్పవచ్చు.
మరి ఇంతకీ ఆ సింపుల్ చిట్కా ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ.దాదాపు అందరి ఇంట్లో దీన్ని రెగ్యులర్ గా వాడుతుంటారు.
అలాగే బంగాళదుంపలను సైతం తరచూ వాడతారు.అయితే ఈ రెండు ఉంటే చాలు చుండ్రు సమస్యను ఈజీగా వదిలించుకోవచ్చు.
అందుకోసం ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక మీడియం సైజు బంగాళదుంపను తీసుకుని తొక్క చెక్కేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
"""/"/
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకుని.స్కాల్ప్ కు ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.
"""/"/
రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.
ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఇట్టే మాయమవుతుంది.
వారంలో ఒకటి లేదా రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు మళ్ళీ మళ్ళీ వేధించకుండా సైతం ఉంటుంది.
కాబట్టి చుండ్రు సమస్యతో ఆగమాగం అవుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
Sports Betting Odds & Protecting Minors: A Down-Under Look For Aussie Crypto Punters