టెస్ట్ మ్యాచ్ కు తొలి రోజు వీరి రాకతో ప్రేక్షకులకు ఇబ్బందులు తప్పవా..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో రెండు మ్యాచ్లను గెలిచిన భారత్.

మూడవ టెస్టు మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని నమోదు చేసుకుంది.

9న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో గెలుపు కోసం ఇరుజట్లు సిద్ధమవుతున్నాయి.

ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది.భారత్ గెలిస్తే 3-1 తేడాతో సిరీస్ కైవసం అవుతుంది.

భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టెస్ట్ మ్యాచ్ ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనిస్ లు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలిరోజు వీక్షించనున్నారు.

ఇరు దేశాల ప్రధాన మంత్రులు రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ మొదటి రోజు ఆన్ లైన్ లో టికెట్స్ బ్లాక్ చేసి, ప్రేక్షకులను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

"""/" / ఒక మొదటి రోజు మినహా ఇతర రోజులలో టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి.

కేవలం ఇరు దేశాల ప్రధానుల భద్రత కోసం మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ విషయంతో క్రికెట్ అభిమానుల్లో కాస్త నిరాశ నెలకొంది.ఇక టెస్ట్ విషయానికి వస్తే జరిగిన రెండు టెస్టులలో అద్భుత ఆటను ప్రదర్శించిన భారత జట్టు.

మూడవ టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ లోనూ, ఫీల్డింగ్ లోనూ ఆస్ట్రేలియాను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయింది.

తాత్కాలిక ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ సారథ్యం లో మూడవ టెస్ట్ మాదిరే గట్టి పోటీ ఇచ్చి సిరీస్ సమం చేస్తుందా.

లేదంటే దీనిపై దృష్టి పెట్టిన రోహిత్ సేన ఆస్ట్రేలియా ఆటగాళ్లను సమర్ధంగా ఎదుర్కొని ప్రతి దాడి చేసి సిరీస్ కైవసం చేసుకొనుందా అనేది చూడాలి.

కమలహాసన్ ఇక మీదట హీరోనా..? విలనా..?