జ్యోతిరావుపూలే స్పూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి.
TeluguStop.com
నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించేంతవరకు ప్రజలు పోరాడాలని పిలుపు.జ్యోతిరావుపూలే కు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళ్లు రాజన్న సిరిసిల్ల జిల్లా :మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతిని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో స్థానిక సిఐటియు కార్యాలయంలో సిఐటియు, రైతుసంఘం, కేవీపీఎస్,ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన బాంధవుడు, కుల రహిత సమాజం కోసం, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయులు అన్నారు.
దేశంలో అంటరానితనం నిర్ములన కోసం కృషి చేశారని అన్నారు.ఆయన స్ఫూర్తితో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల పైన నిత్యవసరం వస్తువుల ధరలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు.
ప్రభుత్వ సంస్థల రక్షణకు కోసం ఇతర సమస్యల పరిష్కరం కోసం జ్యోతిరావు పూలే స్పూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముక్తికాంత అశోక్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, సిఐటియు జిల్లా నాయకులు గురిజాల శ్రీధర్, వేణు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.